Home మెదక్ ఎదురుచూపులు…

ఎదురుచూపులు…

కోటి ఆశలతో ఖేడ్ ప్రజలు
ఆపన్న హస్తం కోసం ఆరాటం
సిఎం రాక కోసం చూస్తున్న వేయి కళ్లు
kcr-image-with-smile-done-iమన తెలంగాణ / సంగారెడ్డి ప్రతినిధి : అనాధిగా అణచివేతకు, నిర్లక్షానికి గురైన సమాజం ఇప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోంది. అన్ని విధాలా అండగా నిలిచి ఆపన్న హస్తం అందిస్తారన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. సిఎం సొంత జిల్లాలో మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దుల్లో చివరగా విసిరేసినట్టు ఉండే ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. నారాయణఖేడ్ నియోజకవర్గం ఉప ఎన్నిక ల పుణ్యమా అని ప్రభుత్వం ప్రత్యేకించి నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తీసుకున్న ప్రత్యేక చొరవ వల్ల ఎప్పుడూ చూడని అభివృద్ధి ఆనవాళ్లను నారాయణఖేడ్ ప్రజలు చూశారు. ఈ అభివృద్ధి చూడటంతో పాటు మంత్రి హరీశ్‌రావు ఊరూరా తిరుగుతూ ఖేడ్‌ను సిద్దిపేటలా అభివృద్ధి చేసి చూపిస్తానని ఎన్నికల ప్రచార సభలో ఇచ్చిన హామీలను ప్రజలు బాగా విశ్వసించారు. దీంతో ఉప ఎన్నిక ల్లో సంపూర్ణ మద్దతుతో భారీ మెజార్టీతో టిఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు. పోలైన ఓట్లలో 60 శాతం మంది ఓటర్లు అధికార పార్టీని అక్కున చేర్చుకున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత రెండు రోజుల పాటు నారాయణఖేడ్ నియోజకవర్గంలోనే బస చేసి ప్రతి మండల కేంద్రా న్ని సందర్శించి ఇక్కడి ప్రజల తాగు, సాగునీటి కష్టాలు తీరుస్తానని, గోదావరి జలాలతో నారాయణఖేడ్ ప్రజల కాళ్లు కడుగుతా నని చెప్పడంతో పాటు నియోజకవర్గంలో విద్యా, వైద్యం, నిరుద్యోగం వంటి సమస్యలను కూడా పరిష్కరించి ఖేడ్‌ను మరో హైదరాబాద్‌గా మారుస్తానని సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీ ఇప్పుడు నియో జకవ ర్గంలో చర్చనీయాంశమైంది. సిఎం ఎప్పుడు మా నియోజకవర్గానికి వస్తారో ఇచ్చిన హామీల అమలును ఎప్పటి నుంచి ప్రారంభిస్తారోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. సిఎం కెసిఆర్ ఎన్నికల ప్రచారం సభలో ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒక్కటైన గట్టులింగంపల్లి వద్ద ఉన్న సహాజ జలవనరులను రిజర్వాయర్‌గా మార్చడం. గట్టులింగంపల్లి రిజర్వాయర్ నిర్మిస్తే ఖేడ్ నియోజకవర్గానికి వర ప్రదా యనిగా మారడంతో పాటు మంజీరా నదిపై నిజాం రాజులు నిర్మించిన ఘణపురం ఆనకట్ట కంటే పెద్దదిగా అవతరిస్తుంది. నియోజకవర్గం లోని మనూరు, నారాయణఖేడ్, పెద్దశంకరంపేట మండలా ల్లో దాదాపు 77 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలవు తుంది. ఎన్నికలకు ముందు మంత్రి హరీశ్‌రావు ఖేడ్ నియోజకవ ర్గంలో పర్యటించిప్పుడు స్థానికలు గట్టులింగంపల్లి వద్ద రిజర్వా యర్ నిర్మాణానికి గల అవకాశాలను ఆయన దృష్టికి తీసుకువచ్చా రు. అప్పటికే ఖేడ్ నియోజకవ ర్గంలోని వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితిని చూసి చలిం చిపోయారు. ఈ పరిస్థితుల్లో స్థానికులు సాగు నీరందించేందుకు వీలున్న ప్రాజెక్టు వివరాలు చెప్ప డంతో వెంటనే స్పందించి గట్టులింగంపల్లి ప్రాంతాన్ని సందర్శించి వెంటనే ప్రణాళిక కూడా సిద్ధం చేయాలని వ్యాప్‌కో సంస్థ సర్వే జరిపించి ప్రాజెక్టు నిర్మాణానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు వ్యాప్‌కో సంస్థ సర్వే నిర్వహించి ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి స్థాయి అవకాశాలు ఉన్నాయని నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. అధికారులు గట్టు లింగంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి డిజైన్ రూపొందించారు. మంజీరాకు కేవలం 1.5 కి.మీ.దూరంలో గట్టు లింగంపల్లి ఉంది. ఈ రిజర్వాయర్‌లో నీటి నిల్వ సామర్థం 0.5 టిఎంసిల నుంచి ఒక టిఎంసి వరకు ఉంటుందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. గట్టు లింగంపల్లి రిజర్వాయర్‌ను మనూరు, నారాయణఖేడ్, పెద్దశంకరంపేట మండలాల్లోని చెరువులకు కాల్వల ద్వారా అనుసంధానం చేయాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వీలును బట్టి మధ్యలో చెక్ డ్యాంల నిర్మాణం చేసి నీటిని సాధ్యమైనంత ఎక్కువ విస్తీర్ణంలో సాగుకు వినియోగించాలని అధికా రులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే నారాయణఖేడ్ మండలంలో రుద్రార్, లింగాపూర్, మాద్వార్, హన్మంతరావుపేట, మత్తడి, నిజాంపేట లోని మదిర చెరువులు నిందడిన తర్వాత మిగులు జలాలు నిజాంసాగర్‌లో కలుస్తాయి. మనూరు మండలం కారముంగి వద్ద ఒక ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి దాదాపు 12 గ్రామాలకు సాగునీరు అందించవచ్చని అధికారులు భావిస్తున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు దత్తత తీ సుకున్నందున ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రజలపై ఎలాంటి సందేహాలు వ్యక్తం చేయడం లేదు. ఒక రోజు అటు ఇటు అయినా ప్రాజెక్టు నిర్మాణం తప్పకుండా జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. దీంతో పాటు అనేక గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, విద్య తదితర సమస్యలు పరిష్కారం కావాలంటే సిఎం కెసిఆర్ నియోజకవర్గంలో రెండు రోజులు పర్యటించి అధికారులతో సమీక్షలు జరపాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.