Home జాతీయ వార్తలు ‘వారి త్యాగాన్ని జాతి మరవలేదు’

‘వారి త్యాగాన్ని జాతి మరవలేదు’

Narendra Modi

 

పుల్వామా అమర జవాన్లకు ప్రధాని నివాళి
ప్రముఖుల శ్రద్ధాంజలి

న్యూఢిల్లీ : సరిగ్గా ఏడాది కిందట పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన 40 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లను సంస్మరించుకుంటూ ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు నాయకులు రాజకీయ పార్టీలకు అతీతంగా శుక్రవారంనాడు వారికి నివాళులర్పించారు. వారి త్యాగాన్ని జాతి ఎన్నటికీ మరువజాలదన్నారు. మరణించిన సైనికులు అసాధారణ వ్యక్తులని, జాతి సేవకు, రక్షణకు తమ ప్రాణాలనే ఫణంగా పెట్టారని మోడీ కొనియాడారు.

గత ఏడాది ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్‌లోని జమ్మూశ్రీనగర్ ప్రధా న రహదారిపై పుల్వామాలో లెత్‌పోరా వద్ద భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న వాహన శ్రేణిపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆనాటి దారుణ సంఘటనలో మరణించిన సిఆర్‌పిఎఫ్ జవాన్లకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, స్మృతి ఇరానీ, హర్దీప్‌పూరీ, ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ శ్రద్ధాంజలి ఘటించారు. లెత్‌పోరా శిబిరం వద్ద ఒక స్మారకాన్ని ప్రారంభిస్తారని, పుల్వామా దాడిలో మరణించిన 40 మంది జవాన్ల ఫోటోలు అందులో ఉంటాయని ఒక ఉన్నతాధికారి తెలిపారు.

Narendra Modi pay tribute to CRPF soldiers