Home జాతీయ వార్తలు రెండోసారి ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం

రెండోసారి ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం

 

న్యూఢిల్లీ: భారతదేశ 16వ ప్రధానిగా నరేంద్ర దామోదర్‌ దాస్‌ మోడీ వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. నరేంద్ర మోడీ చేత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణస్వీకారం చేయించారు. అంతఃకరణ శుద్ధితో దైవసాక్షిగా మోదీ ప్రమాణం చేశారు. మోదీ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కేంద్ర మంత్రిగా రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిష్ గడ్కరీ,నిర్మలా సీతారామన్ లు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బిమ్‌స్టిక్‌ దేశాధినేతలతో పాటు పలువురు దేశ, విదేశీ రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Narendra Modi takes oath as prime minister