*రాజీ కుదుర్చిన ఓ ప్రజాప్రతినిధి
*పాఠశాల మధ్యాహ్న భోజన బియ్యాన్ని పక్కదారి
పట్టిస్తున్న వైనం
*తనకేం తెలియదంటున్న ప్రధానోపాధ్యాయుడు
మన తెలంగాణ/ముప్కాల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద విద్యార్థుల కు మధ్యాహ్న భోజన పథకం ద్వారా సన్న బియ్యాన్ని అందిస్తుంటే ఈ బియ్యా న్ని బయటకు తరలిస్తూ కొన్ని ఏజెన్సీలు పబ్బం గడుపుకుంటున్నారు. ముప్కాల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం బియ్యం పక్కదారి పట్టాయని గ్రామంలోని యువకులు ఆరోపించారు. మన తెలంగాణకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పాఠశాలలో ఏజెన్సీని నిర్వహించే వారే రోజుకు 15 నుండి 25 కెజీల మధ్యాహ్న బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్నారు. స్థానికుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న గ్రామం లో ఇద్దరు యువకులు పథకం ప్రకారం వారిని వెంబడించి మరి పక్కా ఆధా రాలు సేకరించినట్లు సమాచారం. దానికి సంబంధించిన ఫొటోలు వీడియోలు తీసారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక అధికార పార్టీకి ఓ ప్రజాప్రతినిధి సదరు యువకుడి వద్దకు వెళ్ళి బేరసారాలాడాగా దీంతో యువకుడు ఎత్తుకెళ్లిన బియ్యానికి బదులు మరో 5 క్వింటాళ్ల బియ్యాన్ని ఏజెన్సీ వారు పక్క గ్రామం కిసాన్‌నగర్‌లోని నచికేత ఆశ్రమానికి విరాళంగా ఇవ్వాలని, అదే వారికి తగిన శిక్ష అని నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో సదరు ప్రజాప్రతినిధి వారి వద్దనున్న ఫోటోలు, వీడియోలు తొలగించారని సమాచారం. పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఈ విషయంపై సంప్రదించగా తనకేం తెలియదని, తాను ప్రతిరోజు యధావిధిగా ఏజెన్సీ వారికి బియ్యాన్ని కొలిచి ఇస్తున్నామని అన్నారు. పాఠశాల బియ్యం పక్కదారి పట్టించడం, రాజీ కుదుర్చకుని వేరే వాళ్లకు విరాళంగా ఇవ్వడమేంటని అడిగితే తమకేం తెలియదని స్థానిక సర్పంచ్, గ్రామస్థులు కలిసి రాజీ కుదిర్చారని తప్పించుకున్నారు. పాఠశాల బయ ట జరిగిన విషయాలు తమకు అవసరం లేదని అని ఇక నుంచి అలాంటివి జరగకుండా జాగ్రత్తలు చేపడతామని అన్నారు. గతంలో ఇలాంటి తప్పులు చేసిన ఏజెన్సీని ప్రధానోపాధ్యాయుడు, ఎస్‌ఎంసి కమిటీ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలిసి కేవలం రెండు రోజుల్లో ఫిర్యాదులు సేకరించి, విచారణ జరిపించి తొలగించారు. మరి ఇప్పటి ఏజెన్సీ చేసిన తప్పుకు ఉపాద్యాయులు, అధికారులు, కమిటీ లు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని సర్వత్రాఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ప్రధానోపాధ్యాయు డు పై అధికారులకు ఈ విషయాన్ని గురించిన సమాచా రాన్ని ఇప్పటికీ అందజేయకపోవడంపై పలు అనుమానా లు వ్యక్తం అవుతున్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధి కి సంబంధించిన వారు ఏజెన్సీని నడుపుతున్నందున అధికారులు పట్టించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఏజెన్సీని రద్దు చేయాలి : జెడ్పిటిసి జోగు సంగీత
ఉన్నత పాఠశాలలో ఏజెన్సీ నిర్వాకం ఏమి బాగోలేదని, పిల్లలకు అందించాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించడం సరికాదని, ఈ పనికి స్థానిక సర్పంచ్ రాజీ కుదర్చడం పాఠశాల బియ్యాన్ని వేరే చోటికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించడం సిగ్గుచేటని అన్నారు. ప్రధానోపాధ్యాయుడు దీని పై వెంటనే పై అధికారులకు ఫిర్యాదు చేయాలని లేదంటే తానే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని ఆమె హెచ్చరించారు.
నాకు ఎటువంటి సంబంధం లేదు : ముస్కు భూమేశ్వర్, ముప్కాల్ సర్పంచ్
సన్న బియ్యం పక్కదారి పడితే తాను వెళ్లి బేరసారాలు ఆడానని అనడం ఆవాస్తవం. తనకు ముప్కాల్ గ్రామంలో ఇలాంటి విషయం జరిగిందని కూడ తెలియదు.
పై అధికారులకు ఫిర్యాదు చేస్తాం:
శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్
పాఠశాలలోని ఏజెన్సీ సన్న బియ్యాన్ని పక్కదారి పట్టించాలని గ్రామంలోని యువకులు తనకు చరవాణిలో సమాచారం ఇచ్చారు. తాను ఏజెన్సీ వారి వివరణ కోరి పై అధికారులకు త్వరలో నివేదిక పంపిస్తాం.