Friday, April 26, 2024

పేదలకు వరం… కల్యాణలక్ష్మి పథకం

- Advertisement -
- Advertisement -

వెల్దుర్తిః రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం పేదలకు వరం లాంటిదని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 31 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదన్నారు.

రాష్ట్రంలో అమలు చేసిన చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి మంచి పథకాలు లేవన్నారు. పేదంటి ఆడబిడ్డల పెండిళ్లకు పెద్దన్నలా సిఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. అలాగే మెదక్ జిల్లా పద్మశాలి సంఘం యొక్క క్యాలెండర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రమేష్‌గౌడ్, తహసీల్దార్ సురేష్‌కుమార్, ఎంపీడీవో వెంకటలక్ష్మమ్మ, మండల సర్పంచ్‌ల ఫోరమ్ అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, వెల్దుర్తి ఎంపీటీసీ2 మోహన్‌రెడ్డి, మెదక్ మార్కెట్ డైరెక్టర్ రమేచందర్, ఆర్‌ఐ సందీప్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు , ఎంపీటీసీలు, నాయకులు కృష్ణగౌడ్, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News