Home అంతర్జాతీయ వార్తలు చంద్రుడిపై సూర్యరశ్మి సోకని చోట నీటి ఆనవాళ్లు

చంద్రుడిపై సూర్యరశ్మి సోకని చోట నీటి ఆనవాళ్లు

Nasa discovers water on sunlit surface of moon

 

నాసా-హవాయి వర్శిటీ పరిశోధనలో మరో ముందడుగు

వాషింగ్టన్ : చంద్రుడిపై సూర్యరశ్మి సోకని ప్రాంతాల్లోనూ నీటి జాడలున్నాయని మొట్టమొదటి సారి శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇదివరకు అనుకున్నట్టు చల్లని ప్రాంతాలకు, నీడ ప్రాంతాలకే పరిమితం కాకుండా చంద్రుడి ఉపరితలం అంతా నీటి పరమాణువులతో వ్యాపించి ఉంటుందని ఈ పరిశోధన చెప్పడం అత్యంత కీలక పరిణామంగా పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రవేత్తలు అంచనా వేసిన దాని కంటే ఎన్నో రెట్లు అత్యధికంగా నీటి ఆనవాళ్లు ఉన్నట్టు తాజా అధ్యయనాల్లో బయటపడింది. నాసా కు చెందిన సోఫియా టెలిస్కోప్ (స్ట్రాటోస్ఫియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్‌ఫ్రారెడ్ ఆస్ట్రానమీ)ను ఉపయోగించి అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ హవాయి పరిశోధకులతో సహా శాస్త్రవేత్తల బృందం చంద్రుడి దక్షిణార్థ గోళంపై గల క్లెవియస్ బిలంలో నీటి అణువులను కనుగొన గలిగారు.

చంద్రుడిపై ఉండే బిలాల్లో ఇదో పెద్ద బిలం. భూమిపై నుంచి కూడా దీన్ని చూడవచ్చు. చంద్రుడి ఉపరితలంపై గతంలో ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చి ఆర్గనైజేషన్) చంద్రయాన్ 1 మిషన్‌తో సహా జరిపిన పరిశోధనల్లో హైడ్రొజన్‌ను ఒక రూపంలో ఉండడం కనుగొన్నారు. నీటికి దాని సన్నిహిత రసాయన సంబంధం హైడ్రోక్సిల్ (ఒహెచ్)కు మధ్య తేడా గుర్తించడం సాధ్యం కాదని నాసా శాస్త్రవేత్తలు గతంలో వెల్లడించారు. కానీ కొత్త అధ్యయనాల్లో సూర్యరశ్మి ప్రాంతాల్లో కూడా నీరు పరమాణు రూపంలో ఉందని రుజువైంది. జర్నల్ నేచర్ ఆస్ట్రానమీలో ప్రచురితమైన ప్రస్తుత అధ్యయనం క్లెవియస్ బిలం ప్రాంతంలో నీటి సాంద్రతలు మిలియన్‌కు 100 నుంచి 412 భాగాల వరకు అంటే ఒక ఘనపు మీటరు భూమిలో సుమారు 12 ఔన్సుల బాటిల్ నీటితో సమానమైన నీరు ఇమిడి చంద్రుడి ఉపరితలంపై వ్యాపించి ఉందని వివరించింది.

చంద్రుడి ఉపరితలంపై సోఫియా కనుగొన్న నీరు కన్నా సహారా ఎడారిలో వంద రెట్లు ఎక్కువగా నీరు ఉంటుందని పరిశోధకులు పోల్చి చెప్పారు. సోఫియా అధ్యయనానికి ముందు ఏదో ఒక విధమైన రూపంలో నీరు ఉంటుందని తమకు తెలుసని, అయితే ఎంత మొత్తంలో ఉంటుందో తెలియలేదని చెప్పారు. వాస్తవంగా ఆమేరకు నీరు లభించినట్టయితే రోజూ మనం తాగడానికి , డ్రైన్ శుభ్రం చేయడానికి కావలసిన నీరు లభించ వచ్చని శాస్త్రవేత్త కేసే హానిబాల్ వెల్లడించారు. స్వల్పమొత్తాల్లో నీరు లభించడం ఎలా ఉన్నా ఆ నీరు చంద్రుడిపై ఏ విధంగా పుట్టిందో,ఏ విధంగా కఠినమైన, గాలిలేని ఉపరితలంపై ఉంటుందో అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. 45,000 అడుగుల ఎత్తున ఉన్న చంద్రుడిపై పరిశోధనకు సోఫియా మరిన్ని కొత్త మార్గాలను కల్పించిందని చెప్పారు. దట్టమైన వాతావరణం లేకుండా చంద్రుడిపై సూర్యరశ్మి సోకే ఉపరితల ప్రాంతాల్లో ఉండే నీరు అంతరిక్షంలో కోల్పోయి ఉండవచ్చని, అయినా కొంతవరకు మనం దాన్ని చూస్తున్నామని ఏదో ఒకటి నీటిని పుట్టించి ఉంటుందని హానిబాల్ అభిప్రాయ పడ్డారు.

ఈ విధంగా నీటిని సృష్టించడంలో అనేక శక్తులు పాత్ర వహించి ఉంటాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. సూకా్ష్మతి సూక్ష్మమైన ఉల్కల నుండి చంద్రుడి ఉపరితలంపై వర్షించి చిన్న మొత్తాల్లో నీటిని తీసుకుని వచ్చి ఉంటాయని సిద్ధాంతీకరించారు. ఈమేరకు రెండంచెల ప్రక్రియ సిద్ధాంతాన్ని వివరించారు. సూర్యుని సౌర గాలులు హైడ్రొజన్‌ను చంద్రుడి ఉపరితలంపై విడుదల చేయగా, నేలపై ఖనిజాల ఆక్సిజన్‌తో రసాయనిక సంయోగం జరిగి హైడ్రాక్సిల్ సృష్టి జరిగి ఉండవచ్చని సిద్ధాంతీకరించారు. సూక్ష్మ ఉల్కల ఢీకొనడం వల్ల రేడియోధార్మిక శక్తి వెలువడి హైడ్రాక్సిల్ నీరుగా మారి ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయ పడ్డారు. వాస్తవానికి మొదటిసారి సోఫియా నీటి ఆనవాళ్లు కనుగొన్నప్పటికీ పూర్తి డేటా తాము పొందామని అనుకోవడం లేదని సోఫియా ప్రాజెక్టు సైంటిస్టు నసీమ్ రాంగ్వాలా పేర్కొన్నారు. ఇంకా మరికొన్ని అధ్యయనాలు చేపడతామని చెప్పారు. ఏదేమైన చంద్రుడి ద్రువ ప్రాంతాల్లో శాశ్వతంగా సూర్యకాంతి పడని కోల్డ్ ట్రాప్స్ మంచుతో నిండి ఉన్నట్టు అధ్యయనాలు రూఢి చేశాయి.

Nasa discovers water on sunlit surface of moon