Friday, April 19, 2024

అంగారక గ్రహంపై ఎగిరిన నాసా హెలికాప్టర్

- Advertisement -
- Advertisement -

NASA experimental helicopter 'Ingenuity' flies into air on Mars

మరో గ్రహంపై సాధించిన ఘన విజయంగా శాస్త్రవేత్తల ప్రశంసలు

కేప్‌కెనవెరల్ (అమెరికా): ఎర్రని దుమ్ము ఆవరించిన అంగారక గ్రహ ఉపరితలం నుంచి నాసా ప్రయోగాత్మక హెలికాప్టర్ ‘ఇన్‌జెన్యుటీ’ సోమవారం గాలి లోకి ఎగిరింది. ఇది కొంతసేపు గాలిలో ఎగిరి తిరిగి అంగారక గ్రహం ఉపరితలం పైకి చేరుకుంది. విద్యుత్‌తో నడిచే నియంత్రిత హెలికాప్టర్ మరోగ్రహంపై ఈ విధంగా తన లక్షాన్ని సాధించడం మొదటి ఘన విజయంగా నాసా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. నాసా శాస్త్రవేత్తల ఆనందానికి అవధుల్లేవు. 1903 లో రైట్ సోదరులు మొదటిసారి విమానాన్ని గగనంలో విహరింప చేసినంత ఖ్యాతి ఇప్పుడు సాధించినట్టయిందన్న ప్రశంసలు లభించాయి. అప్పటి రైట్ సోదరుల తొలి విమానం రెక్కల తాలూకు గుడ్డ పీలికను ఈ హెలికాప్టర్ మోసుకు వెళ్లడం విశేషం. 1.8 కిలోల బరువున్న ఈ మినీ హెలికాప్టర్ ఇన్‌జెన్యుటీ గగనంలో కొద్దిసేపు విహరించిందని కాలిఫోర్నియా లోని ఫ్లైట్ కంట్రోలర్లు నిర్ధారించారు.

పెర్సెవరెన్స్ రోవర్ ద్వారా వీరికి డేటా లభించింది. 85 మిలియన్ డాలర్ల వ్యయంతో రూపొందిన ఈ హెలికాప్టర్ డెమో పెద్దరిస్కుతో కూడుకున్నదైనా ఎక్కువ రివార్డు సాధించ గలిగింది. దీంతో మానవులు మరో గ్రహంపై ఇదే విధంగా హెలికాప్టర్ ఎగురవేయగలరన్న ధీమా కలిగిందని ప్రాజెక్టు మేనేజర్ మిమి అయుంగ్ విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ఈ హెలికాప్టర్ 287 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఎంతవరకు అనుకున్న లక్షం సాధించి ఎగరగలుగుతుందో అన్న ఉత్కంఠతో అయుంగ్ ఆమె బృందం దాదాపు మూడు గంటల పాటు నిరీక్షించ వలసి వచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News