Tuesday, April 16, 2024

గ్రహశకలం విక్షేపంచేసే ‘డార్ట్ అంతరిక్ష నౌక’ను ప్రయోగించిన ‘నాసా’

- Advertisement -
- Advertisement -

DART spacecraft launch

DART
వాషింగ్టన్: ‘డార్ట్ అంతరిక్ష నౌక’గా పిలిచే ప్రపంచంలోని మొట్టమొదటి ప్లానెటరీ డిఫెన్స్ సిస్టంను మంగళవారం పసిఫిక్ కాలమాన ప్రకారం రాత్రి 10.21గంటలకు(భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం 11.51 గంటలకు) అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి విజయవంతంగా  ప్రయోగించింది. అది స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్‌ను మోసుకెళ్లింది. ఈ అంతరిక్ష నౌక లక్షం 160 మీటర్ల వ్యాసం కలిగిన డైమోర్ఫోస్‌గా పిలిచే చిన్న చంద్రుడు. ఈ లక్షాన్ని సెకనుకు దాదాపు 6.6 కిమీ. వేగంతో లేక గంటకు 24000 కిమీ. వేగంతో అంతరిక్ష నౌక ఢీకొంటుంది. ఈ ఢీకొనడమనేది 2022 సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 1 మధ ఉండగలదని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News