Home Default సూర్యుని అంచులోని కాంతిపుంజాలు

సూర్యుని అంచులోని కాంతిపుంజాలు

NASA-Parker
తొలి ఛాయా చిత్రాలు  పంపిన నాసా పార్కర్

వాషింగ్టన్ : సూర్యుడి అంచులో మొట్టమొదటి అధ్యయనంలో కనుగొన్న కాంతి పుంజాల ఛాయా చిత్రాలను నాసా పార్కర్ సోలార్ ప్రోబ్ నాసా కేంద్రానికి పంపగలిగింది. దీనివల్ల సూర్యుని వాతావరణానికి సంబంధించిన అద్భుతమైన సమాచార నిధి లభించినట్టయిందని నాసా వెల్లడించింది. ప్రోబ్ అందించిన డేటా జర్నల్ నేచర్‌లో నాలుగు పత్రాల్లో వెలువరించారు. ఈ డేటాతో సూర్యునికి సంబంధించిన నిగూఢ రహస్యాలు చేధించడానికి వీలవుతుంది. సూర్య కంకణంగా పేర్కొనే సూర్యుని వాతావరణ పరిస్థితి ఎందుకు సూర్యుని ఉపరితలం కన్నా వందరెట్లు వేడిగా ఉంటుంది? సౌరవాయువుల మూలం ఎక్కడ ? వంటి చిక్కు ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని నాసా విశ్వసిస్తోంది.

2018 ఆగస్టులో నాసా సోలార్ ప్రోబ్ పనిచేయడం ప్రారంభించింది. నిర్ణయించుకున్న మొత్తం 24 మార్గా ల్లో మూడింటిని అధిగమించింది. ఇదివరకు ఎప్పుడూ ఈ విధంగా సూర్య వాతావరణం బయటపడలేదు. వ్యోమనౌక చుట్టూ వ్యాపించిన వాతావరణాన్ని శాస్త్రీ య పరికరాలను ఉపయోగించి కొలవ గలిగారు. సూర్యుని నుంచి వేగంగా వెలువడే అణువులు, వాటి ప్రవర్తన గురించి కొత్త సమాచారం ఈ అధ్యయనంలో లభిస్తుంది. సూర్యుని భౌతిక తత్వంపై సైద్ధాంతిక పరమైన ప్రశ్నలకు తగిన సమాధానం శాస్త్రవేత్తలు ఇవ్వడానికి వీలవుతుందని నాసా ఒక ప్రకటనలో పేర్కొంది. అంతరిక్షంలో వ్యోమగాములను రక్షించగలిగే సాంకేతికతను అభివృద్ధి చేయడానికి వీలుగా సూర్యుడు ఏ విధంగా నిరంతరం పదార్ధాన్ని శక్తిని విడుదల చేస్తుంటాడో, పార్కర్ తగిన సమాచారాన్ని అందిస్తుంది.

ఫలితంగా శాస్త్రవేత్తలు మన గ్రహం చుట్టూ అలముకున్న అంతరిక్ష వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగించే నమూనాలను తిరిగి కొత్తగా రూపొందించడానికి తోడ్పడుతుంది. ఎటువంటి నక్షత్రాలు ఆవిర్భవిస్తుంటాయో ఆ ప్రక్రియ ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు. పార్కర్ వెలువరించిన మొదటి డేటా సూర్యుడిని కొత్తగా, వింతగా ఆవిష్కరించ గలిగిందని నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ సైన్స్ థామస్ జుర్బు చెన్ చెప్పారు. దూరం నుంచి కాకుండా చాలా దగ్గరగా సూర్యుడ్ని అధ్యయనం చేయడం వల్ల అనూ హ్య సౌర దృశ్యం ముఖ్యంగా గోచరిస్తుంది. భూమిపై మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో కూడా తెలుస్తుంది. పాలపుంత లోని చురుకైన నక్షత్రాలను అర్థం చేసుకోడానికి కొత్త కోణం మనకు అందిస్తుంది. సూర్యుని భౌతిక తత్వం తాలూకు ఉద్వేగభరిత అనుభూతికి ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని కొత్త ఆవిష్కరణలకు పార్కర్ దిక్సూచికగా జుర్బుచెన్ అభివర్ణించారు.