Wednesday, April 24, 2024

దూసుకొస్తున్న భారీ గ్రహశకలం

- Advertisement -
- Advertisement -

NASA tracking asteroid headed toward Earth

వాషింగ్టన్: భూమి సమీపంలోకి ఓ భారీ గ్రహశకలం దూసుకొస్తున్నట్టు నాసా గుర్తించింది. అమెరికాలోని ఎంపైర్ స్టేట్ భవనంకంటే పొడవైన ఈ గ్రహశకలం ఈ నెల 6న భూమికి దగ్గరగా రానున్నట్టు నాసా పరిశోధకులు పేర్కొన్నారు. దీనికి రాక్ 163348 (2002 ఎన్‌హెచ్4) అని నామకరణం చేశారు.

సెకనుకు 5.2 కిలోమీటర్ల వేగంతో (గంటకు 11,200 మైళ్ల వేగం) కదులుతున్న ఈ స్పేస్ రాక్.. ఈ వారంలోనే భూకక్ష్యను ఆనుకుని వెళ్లనుంది. దీని పరిమాణం 820×1870 అడుగులుగా ఉంది. ఎంపైర్ స్టేట్ (1453 అడుగులు), లండన్ ఐ (443 అడుగులు) కంటే పొడవుగా ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం లేదనీ.. అయితే ఇది భూ వాతావరణంలోని ప్రవేశిస్తుందా లేదా అన్న దానిపై ఓ కన్నేసి ఉంచామని అంటున్నారు.

NASA tracking asteroid headed toward Earth

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News