Friday, March 29, 2024

జనాభా, కేసుల ఆధారంగా రాష్ట్రాలకు కోవిడ్ టీకాలు

- Advertisement -
- Advertisement -

National Covid-19 vaccination guidelines Release

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జాతీయ కరోనా వ్యాక్సినేషన్ మార్గదర్శకాలు మంగళవారం విడుదల చేసింది. రాష్ట్రాలకు కేంద్రం ఫ్రీగా వ్యాక్సిన్ కేటాయించనుంది. ఈ నెల 21 నుంచి నూతన మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. ఆర్థిక స్థితిగతులతో  సంబంధం లేకుండా అందరికీ ఉచిత టీకాలు ఇవ్వనుంది కేంద్రం. జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు కేంద్రం టీకాలను పంపిణీ చేయనుంది. కరోనా తీవ్రంగా ఉన్న రాష్ట్రాలకు టీకాల కేటాయింపుల్లో ప్రాధాన్యత కల్పిస్తామని కేంద్ర సర్కార్ వెల్లడించింది. అటు టీకాలు వృథా చేసే రాష్ట్రాలకు కేటాయింపుల్లో కోత విధిస్తామని హెచ్చరించింది. వ్యాక్సినేషన్ సక్రమంగా అమలు చేసే రాష్ట్రాలకు ప్రాధన్యత ఉంటుందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు టీకాల లభ్యత సమాచారాన్ని కేంద్రానికి ఎప్పటికప్పుడు వెల్లడించాలని ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News