Saturday, April 20, 2024

నిబంధనలు పాటించని కంపెనీలకు భారీ జరిమానా

- Advertisement -
- Advertisement -

National Green Tribunal issues directions to PCB

హైదరాబాద్: నిబంధనలు పాటించని, కాలుష్యానికి కారణమవుతున్న పలు కంపెనీలకు భారీ జరిమానా విధించినట్టు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటి) తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. జోగులాంబ గద్వాల జిల్లాలో పలు పత్తి విత్తన ప్రాసెసింగ్ పరిశ్రమలు, జిన్నింగ్ మిల్లులు నిబంధనలు పాటించడం లేదంటూ మధుసూధన్ రెడ్డి అనే వ్యక్తి ఎన్జీటిలో దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయ సభ్యుడు జస్టిస్ రామకృష్ణన్ సభ్య నిపుణుడు సైబల్‌దాస్ గుప్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.

గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం తీసుకున్న చర్యలపై రాష్ట్ర పిసిబి నివేదిక సమర్పించింది. ఆ ప్రాంతంలో ఉన్న 23 పరిశ్రమలను తనిఖీ చేయగా అందులో 17 సంస్థలు నిబంధనలు పాటించడం తేలిందని వివరించింది. ఈ పరిశ్రమలకు రూ.1.52 కోట్ల పర్యావరణ పరిహారం కింద జరిమానా విధించినట్టు ఎన్జీటికి తెలిపింది. అయితే ఈ పరిశ్రమలు భవిష్యత్‌లో తదుపరి నిబంధనలు పాటించకుంటే మరో నివేదిక అందించాలని పిసిబికి ఎన్జీటికి ఆదేశించింది.

National Green Tribunal issues directions to PCB

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News