Friday, April 19, 2024

మోడీజీ.. మీరు చేసిన అప్పులకు సార్థకత ఏదీ?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశాలు, రాష్ట్రాలు చేస్తున్న అప్పులపైన జాతీయ స్థాయిలో వాడీవేడిగా చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అప్పులు చేసి తెచ్చిన నిధులను అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేస్తున్నారా? లేక ఇతరత్రా దుబారా చేస్తున్నారా? అనే అంశాలపై ఆర్థిక మంత్రిత్వ ఆర్థికవేత్తల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా ఆర్థిక సంస్థల నుంచి అప్పు లు చేసి నిధులను సమీకరించుకున్నా, లేక విదేశా ల నుంచి రుణాల రూపంలో నిధులను సేకరించుకున్నా తప్పనిసరిగా ఆ నిధులను అభివృద్ధి, మౌలి క సదుపాయాల కల్పనకే ఖర్చు చేయాలని ఆర్థిక మంత్రిత్వశాఖల్లో ఒక స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి. అంతేగాక అప్పులిచ్చే ఆర్థిక సంస్థలు కూడా ఎందుకు అప్పులు అడుగుతున్నారు? ఎలా అ ప్పులు తీరుస్తారనే సమగ్ర నివేదిక (బిజినెస్ రిపోర్ట్ లేక ప్రాజెక్ట్ రిపోర్ట్)ను అడుగుతాయని, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, జెబిఐసి వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, దేశాల మధ్య జరిగే అప్పుల ఒప్పందాలు కూడా ఇవే మౌలిక సూత్రాలను ఆధా రం చేసుకొనే జరుగుతాయని వివరించారు.

ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులు, ఆ రుణాల నిధులను ఇతరత్రా మార్గాలకు మళ్లించి నిధులను ఖర్చు చేసినట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ అప్పులన్నీ కలిపి రూ. 153 లక్షల కోట్లకు పెరిగాయని, గడచిన ఎనిమిదేళ్లల్లో సుమారు రూ.80 లక్షల కోట్ల నిధులను అప్పుల రూపంలో తీసుకొచ్చారు. ఈ నిధులను ని ర్దేశించిన పథకాలు, అభివృద్ధి పనులకు కాకుండా మిలటరీ రంగాలు, ఇతర అనుత్పాదక రంగాలపై నా ఖర్చు చేశారని, అందుకే జాతీయస్థాయిలో వి మర్శలు మిన్నంటాయని ఆర్థ్ధికశాఖలోని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. అమెరికా, బ్రి టన్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, చైనా వంటి 207 దే శాలు అప్పులు చేశాయని, కాకుంటే ఆ దేశాలన్నీ మౌలిక సదుపాయాల కల్పనకు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను ఖర్చు చేశాయని, అందుకే అక్క డి పాలకవర్గాలపై ఎలాంటి విమర్శలు, ఆరోపణలు, తిరుగుబాట్లు లేవని వివరించారు.

అదే మనదేశం విషయానికొస్తే అప్పులు తెచ్చిన నిధులను రక్షణ రంగానికి, ఇతర అనుత్పాదక రంగాలకు ఖర్చు చేసి అభివృద్ధి, సంక్షేమాలను గాలికొదిలేయడమే కాకుండా, మౌలిక సదుపాయాల కల్పనకు కూడా ఒక్క రూపాయి చేయలేదనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్ కూడా విదేశాల నుంచి అప్పులు చేసిన దేశాల జాబితాలో 17వ స్థానాన్ని ఆక్రమించుకొందని వివరించారు. ప్రపంచ బ్యాంకు, ఐ.ఎంఎఫ్‌ల నివేదికల ప్రకారం మన దేశానికి 620.7 బిలియన్ డాలర్ల (సుమారు 50 లక్షల కోట్ల రూపాయలు) వరకూ విదేశీ అప్పులున్నాయి. ఈ అప్పులు మనదేశ జిడిపిలో 19.90 శాతం వరకూ ఉందని వివరించారు. అయితే విదేశీ అప్పుల నిధులను కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పథకాలకుగానీ, మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేయకుండా ఇతరత్రా రంగాలకు ఖర్చు చేసిందనే విమర్శలున్నాయి. ఇదే క్రమంలో ప్రపంచానికి పెద్దన్నగా, అగ్రరాజ్యంగా, భూతల స్వర్గంగా పేరుగాంచిన అమెరికా కూడా విదేశీ అప్పుల కేటగిరీలో అగ్రస్థానంలోనే నిలిచిందని, ఏకంగా 31 ట్రిల్లియన్ డాలర్ల మేర అప్పులు చేసిన అమెరికా ఆ దేశ జిడిపిలో విదేశీ అప్పులు 121.08 శాతం ఉందని వివరించారు.

రెండో స్థానంలో ఉన్న బ్రిటన్ 8.73 ట్రిల్లియన్ డాలర్లు (జిడిపిలో 273.06 శాతం), మూడోస్థానంలో ఉన్న ఫ్రాన్స్ 7.04 ట్రిల్లియన్ డాలర్లు (ఆ దేశ జిడిపిలో 253.35 శాతం), నాలుగో స్థానంలో జర్మనీ 6.46 ట్రిల్లియన్ డాలర్లు (ఆ దేశ జిడిపిలో 160.35 శాతం) అప్పులు చేశాయి. జపాన్ ట్రిల్లియన్ డాలర్లు (జిడిపిలో 101.41 శాతం), చైనా 2.64 ట్రిల్లియన్ డాలర్లు (ఆ దేశ జిడిపిలో 14.39 శాతం), ఇటలీ 2.71 ట్రిల్లియన్ డాలర్లు వరకూ అప్పులు చేశాయి. ఇలా ప్రపంచంలోని 207 దేశాలు అప్పులు చేసిన జాబితాలో ఉన్నాయి. అయినప్పటికీ ఈ అప్పుల నిధులను ఆయా దేశాలు అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలకే ఖర్చు చేసిందని కొందరు ఆర్థికవేత్తలు పేర్కొన్నారనే చర్చ జరుగుతోంది. ఇలా అప్పులు చేయడం దేశాలకు, రాష్ట్రాలకూ కొత్తేమీ కాదని, కాకుంటే అప్పులుగా తెచ్చిన నిధులను దేశ సర్వతోముఖాభివృద్ధికి ఖర్చు చేశామా? లేక ఇతర అవసరాలకు ఖర్చు చేశామా? అనేదే చర్చనీయాంశమయ్యాయని ఆర్థికశాఖలోని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. భారతదేశ విదేశీ అప్పులు గడచిన ఎనిమిదేళ్లల్లోనే పది రెట్లు పెరిగాయని వివరించారు.

కానీ తెచ్చిన అప్పుల నిధులతో దేశంలో ఒక్క భారీ నీటిపారుదల ప్రాజెక్టును నిర్మించలేదని, కనీసం ఒక లక్ష మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను నిర్మించలేదని, కనీసం రహదారులపైనా ఖర్చు చేయలేదని, ఇప్పటికీ లక్షలాది గ్రామాలకు విద్యుత్తు లేదని, కనీసం తాగునీటి అవసరాలను తీర్చే ప్రాజెక్టులను కూడా చేపట్టలేదని వివరించారు. అంతెందుకు దేశ రాజధాని అయిన న్యూఢిల్లీలోనే తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అనేకసార్లు ప్రస్తావించారని, ఈ అంశాలే నేడు జాతీయస్థాయిలో చర్చకు దారితీశాయని ఆ అధికారులు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులకు సార్థకత లేకుండా పోయిందని, అందుకే సర్వత్రా విమర్శలను చవిచూడాల్సి వస్తోందని పేర్కొన్నారు. దేశాన్ని పాలిస్తున్న కేంద్ర ప్రభుత్వంగానీ, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలుగానీ రుణాలుగా తెచ్చుకొన్న నిధులతో ప్రజలకు సకల సదుపాయాలను కల్పిస్తూ రాష్ట్ర, దేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములను చేసే విధంగా ఆ నిధులను ఖర్చు చేయాల్సి ఉందని, కానీ కేంద్ర ప్రభుత్వం అలా చేయకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయని వివరించారు.

అందుకే దేశానికి తెలంగాణ మోడల్ పాలన కావాలనే డిమాండ్లు పెరుగుతున్నాయని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పులు తెచ్చిందని, కానీ ఆ నిధులను కాళేశ్వరం వంటి నీటి ప్రాజెక్టుల నిర్మాణాలు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు, రహదారులు, ఫ్లైఓవర్లు వంటి అనేక మౌలిక సదుపాయాలను కల్పించుకొంటూ ముందుకు సాగుతోందని వివరించారు. అంతేగాక రైతుబంధు, దళితబంధు, ఆసరా పెన్షన్లు, కులవృత్తులకు ఆర్థిక సహకారాలు అందిస్తూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహనగరం నుంచి గ్రామీణ మారుమూల ప్రాంతాల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగే విధంగా ఒక నిర్ధిష్టమైన ఎకనామిక్ యాక్టివిటీ తెలంగాణలో జరుగుతోందని, ఇలాంటి సమగ్ర విధానం కేంద్ర ప్రభుత్వంలో లేకపోవడంతోనే చేసిన అప్పులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయని సదరు అధికారులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News