Home ఎడిటోరియల్ సర్పంచులైనా కుర్చీలకు దూరమే

సర్పంచులైనా కుర్చీలకు దూరమే

National Political Party

 

కులాల వారీగా పార్టీలున్నప్పుడు సమాజంలో సగం జనాభాగా ఉన్న మహిళలకు కూడా ఒక పార్టీ ఎందుకుండొద్దు? మహిళలు ఒక రాజకీయ పార్టీ ఎందుకు పెట్టుకోకూడదనే ఆలోచనలు మహిళలనందరినీ తొలిచినయి. ఈ సందర్భంగా ‘నేషనల్ వుమెన్ పార్టీ’ గా జాతీయ రాజకీయ పార్టీ’ని అధికారికంగా ప్రకటించిన డాక్టర్ శ్వేతా శెట్టిని అందరం బోయి అభినందించాలి. ఇది చాలా సంతోషకరమైన వార్త మహిళలకు. మగ సమాజము, మగ రాజకీయ పార్టీలు మహిళలకు రాజకీయ రిజర్వేషన్స్ కల్పించడంలో మహిళల కోసం చట్టాలు ‘ఉమెన్ ఫ్రెండ్లీ’ గా రూపొందించడంలో, వాటిని అమలు చేయడంలో విఫలమైనయి. చట్ట సభల్లో యాభై శాతం (50%) స్థానాల్లో జనాభా దామాషా ప్రకారం అంటే కోటాలో కోటాగా మహిళలు ఎన్నిక కావడమే లక్షంగా పెట్టుకొని పని చేయాల్సిన అవసరముంది. జనాభాలోనే కాదు చట్ట సభల్లో కూడా సగ భాగంగా వున్నప్పుడే మహిళల చుట్టూత వున్న ఆర్థిక, సామాజిక జెండర్ హక్కుల్ని సాధించుకుంటారు. ఆ దిశగా ‘నేషనల్ వుమెన్ పార్టీ’ సాగుతుందని ఆశిద్దాము.

నిన్న మొన్నటి దాకా అసెంబ్లీ అంగడి జరిగింది. తెలంగాణలో ఇపు డు వచ్చే నెల్లో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నయి. నిన్న మొన్న జరిగిన తెలంగాణ అ సెంబ్లీ ఎన్నికల్లో దాదాపు రెండు వేల మంది మగ అభ్యర్థులు బరిలో ఉంటే కేవలం నలభై మూడు (43) మంది మహిళలు మాత్రమే ఎన్నికల బరిలో వున్న వివక్షలు, అవమానాలు చూసినం.

మహిళలపట్ల వారి రాజకీయ ప్రాతినిధ్యాలపట్ల వారి నాయకత్వాలపట్ల కమ్యూనిస్టులు, సోషలిస్టులు, మతవాదులు, కులవాదులు అణగారినవాదులు అందరిదీ ఒకటే లెక్కగా సాగుతున్నది. రిజర్వేషన్ కోటాల్లో కూడా మహిళలకు చెందడడం లేదు. మగవాల్లే కొట్టేస్తున్నరు. యీసారి జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌సి మహిళలే లేరు. ఎస్‌సి రిజర్వుడు స్థానాలన్నీ మగ అభ్యర్థులే దక్కించుకున్నరు. మొత్తం గెలిచిన మహిళలు మొత్తంలో ముగ్గురు రెడ్డి మహిళలు, ముగ్గురు ఎస్‌టి మహిళలు. ఇక ఎస్‌సి, బిసి, మైనారిటీ ముస్లిం మహిళల ప్రాతినిధ్యమే అసెంబ్లీలో లేకుండా పోయింది. స్వాతం త్య్ర మొచ్చి ఎనిమిది దశాబ్దాలు దాటినా పార్లమెంట్‌లో 11% మహిళా ప్రాతినిధ్యం.

వీటన్నింటి నేపధ్యంలో జనాభాలో సగంగా వున్న మహిళలు మానసికంగా చాలా గాయపడివున్నరు. ఇంకో వైపు మహిళా రిజర్వేషన్ బిల్లు పాతికేండ్ల నుంచి ఎలాంటి చలనం లేకపోవడానికి ఎదిగిన సవర్ణ మహిళా సమూహాల వైఫల్యంగా చెప్పొచ్చు. మహిళా దామాషా ప్రకారం వల్లనే అది ఆగిపోయింది. మహిళలు జనాభా దామాషా ప్రకారం బిల్లు పెట్టాలనే మగ బిసి పార్టీలు కూడా మాట్లాడకపోవడం అన్యాయం. బిల్లు గురించి లేవనెత్తినప్పుడే దామాషా గురించి మాట్లాడ్తున్నరు కాని దామాషా ప్రకారం బిల్లు పాస్ కావడానికి ఎలాంటి ప్రయత్నాలు ఉద్యమాలు జరగడం లేదు. ఇక ఆధిపత్య మగవాల్లకు గుత్తగుండుగా తమ ఆడవాల్లే చట్ట సభల్లో ఉండాలి మిగతా బిసి మహిళల్ని రానివ్వొద్దనే కుల, మగ వివక్షలుండడం వల్ల బిల్లు పాస్ కానివ్వడం లేదు. దీనికి భిన్నంగా సవర్ణ మహిళలు లేరని యిన్నాళ్ల వీరి కార్యాచరణలో తేలింది.

కులాల వారీగా పార్టీలున్నప్పుడు సమాజంలో సగం జనాభాగా ఉన్న మహిళలకు కూడా ఒక పార్టీ ఎందుకుండొద్దు? మహిళలు ఒక రాజకీయ పార్టీ ఎందుకు పెట్టుకోకూడదనే ఆలోచనలు మహిళలనందరినీ తొలిచినయి. ఈ సందర్భంగా ‘నేషనల్ వుమెన్ పార్టీ’ గా జాతీయ రాజకీయ పార్టీ’ని అధికారికంగా ప్రకటించిన డాక్టర్ శ్వేతా శెట్టిని అందరం బోయి అభినందించాలి. ఇది చాలా సంతోషకరమైన వార్త మహిళలకు. మగ సమాజము, మగ రాజకీయ పార్టీలు మహిళలకు రాజకీయ రిజర్వేషన్స్ కల్పించడంలో మహిళల కోసం చట్టాలు ‘ఉమెన్ ఫ్రెండ్లీ’ గా రూపొందించడంలో, వాటిని అమలు చేయడంలో విఫలమైనయి. చట్ట సభల్లో యాభై శాతం (50%) స్థానాల్లో జనాభా దామాషా ప్రకారం అంటే కోటాలో కోటాగా మహిళలు ఎన్నిక కావడమే లక్షంగా పెట్టుకొని పని చేయాల్సిన అవసరముంది. జనాభాలోనే కాదు చట్ట సభల్లో కూడా సగ భాగంగా వున్నప్పుడే మహిళల చుట్టూత వున్న ఆర్థిక, సామాజిక జెండర్ హక్కుల్ని సాధించుకుంటారు. ఆ దిశగా ‘నేషనల్ వుమెన్ పార్టీ’ సాగుతుందని ఆశిద్దాము.

73వ రాజ్యాంగ సవరణను అనుసరించి పంచాయతీ రాజ్ చట్టంలో ముందు 1/3 వంతు రిజర్వేషన్స్ కల్పించబడితే యిపుడు 50% స్థానాలు మహిళలకు రిజర్వే చేయబడినదనేది సంతోషమే. ఇపుడు తెలంగాణలో యాభై శాతమంటే మొత్తం పంచాయతీ స్థానాలు తెలంగాణలో 12,751, దీంట్ల 6,378 స్థానాలు మహిళలకు వస్తయి. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ఒసి, మహిళ లందరికీ కలిపి 50% స్థానాల్ని మహిళలకు కేటాయించడం, స్థానిక సంస్థల్లో సగం మంది మహిళలు వార్డు మెంబర్లుగా, సర్పంచ్‌లుగా, జెడ్‌పిటిసిలు, ఎంపిటిసిలు, ఎంపిపిలు, జెడ్‌పి చైర్ పర్సన్‌లుగా చూడ్డము ఆనందమేకాని ఈ మహిళలు తమ స్వయం ప్రతిపత్తిగా, స్వయం నిర్ణయాధికారులుగా, సాధికారతలో కూడిన నిర్వహణలు ఈ మగ ప్రపంచం, అధికార మగ ప్రపంచం చేయనిస్తుందా!

ఇప్పటికే ఎస్‌సి, ఎస్‌టి మహిళా ప్రతినిధుల మీద పటేండ్లు పెత్తనం చేస్తూ అధికారాలు చిక్కకుండా చేస్తున్నవి, పంచాయతీ ఆఫీసుల్లో కుర్చీ మీద కూడా కూర్చోనివ్వని సంగతులు, పంచాయతీ ఫండ్స్ అన్నీ బొక్కి ఎస్‌సి, ఎస్‌టి మహిళల అమాయకత్వాల్ని ఆసరాగ చేసుకొని అధికార దుర్వినియోగ అగచాట్లన్నీ వాల్లమీదేసి, వాల్లను దోషులుగా నిలబెట్టడం చేస్తుండ్రు. మహిళలు కొంచెం తెలివిగా ఉండిన కాడ వాల్ల మీద అవిశ్వాస తీర్మానాలు పెట్టి పదవులు ఊడబీకిన కేసులు కోకొల్లలు. వాల్ల మగవాల్ల అండవున్నా వాల్లు కూడా పటేండ్ల ముందు అసహాయులే. అట్లా ఇక్కడ ఎస్‌సి, ఎస్‌టి మహిళల మీద ఓ దిక్కు భర్తల పెత్తనం కొంచెమైనా పటేండ్ల పెత్తనాలు, కుర్చీ మీద కూచోని వ్యవహారాలు నడపనివ్వని కుల వివక్షలు అడుగడుగున హేళనలు ‘పేనుకు పెత్తన మిస్తే’ అనే అవహేళనలు యిటు కుటుంబాలు, భర్తల నుంచి కూడా అనుమానం వేధింపులు, సాధికారికంగా తిరగలేని సంకెళ్లు ఆవరించి వుంటాయి. ఈ మహిళలకు వారి శక్తి సామర్థాలు పెంచే శిక్షణ ఉండాలి. తమిళనాడులోలాగ రిజర్వుడు స్థానా ల్లో రెండవ సారి కూడా రిజర్వుడ్ చేసి అవకాశా లు కల్పిస్తే కొంత రాజకీయంగా రాటు తేల్తారు.

National Political Party was officially declared as National Women’s Party

Telangana Latest News