Home తాజా వార్తలు సంగారెడ్డి, జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులకు జాతీయ గుర్తింపు

సంగారెడ్డి, జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులకు జాతీయ గుర్తింపు

Govt-Hospital
మనతెలంగాణ/హైదరాబాద్ : సంగారెడ్డి, జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులకు జాతీయ గుర్తింపు లభించింది. లక్షా సర్టిఫికేషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ ప్రతినిధులు ఈ ఏడాది మే 22, 23వ తేదీల్లో సంగారెడ్డి, జహీరాబాద్ ఆసుపత్రులలోని లేబర్ రూం, ఆపరేషన్ గదులను తనిఖీలు చేపట్టారు. లేబర్, ఆపరేషన్ గదుల నిర్వహణలో జహీరాబాద్ ఆసుపత్రి 97శాతం, 87శాతం స్కోర్‌ను సాధించగా, సంగారెడ్డి ఆసుపత్రి 93శాతం, 91 శాతం స్కోరు సాధించింది. దీనికి సంబంధించిన గుర్తింపు పత్రాలను శనివారం అందజేస్తున్నట్లు నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్, అడిషనల్ సెక్రటరీ మనోజ్ జలాని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు పంపారు.

National Recognition for Sangareddy and Zahirabad Govt Hospitals