Saturday, April 20, 2024

టిక్‌టాక్…ఆ వీడియో ఆపేయ్ …

- Advertisement -
- Advertisement -

National Women's Commission action on Acid Attack Tik Tok Video

 

న్యూఢిల్లీ : ఓ మహిళపై ఓ వ్యక్తి యాసిడ్ దాడికి దిగుతున్న దృశ్యంతో కూడిన టిక్‌టాక్ వీడియోపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్య్లు) స్పందించింది. దీనిని వెంటనే తొలిగించాలని ఆదేశించింది. ఈ వీడియో క్లిప్ పెట్టడానికి బాధ్యులైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర పోలీసు విభాగానికి తాఖీదులు పంపించింది. మహిళల పట్ల దౌర్జన్యాలు పెరిగిపోవడం చాలా బాధాకరం, పైగా మహిళపై దౌర్జన్యం వీడియోను పెట్టడం హింసాత్మక ప్రవృత్తిని పెంచడమే అవుతుందని కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత వీడియోను సీరియస్‌గా తీసుకున్న కమిషన్ టిక్‌టాక్ ఇండియా ఫిర్యాదుల విభాగం అధికారి అనుజు భాటియాకు లేఖ పంపించింది. టిక్‌టాక్ యుజరు ఫైజల్ సిద్ధిఖీ ఈ వీడియోను పోస్టు చేశాడు. దాదాపు కోటిన్నర మంది ఫాలోయర్లు ఉన్న సిద్ధిఖీ పెట్టిన వీడియో సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది.

దీనిపై మీడియాలో వచ్చిన వార్తలపై ఎన్‌సిడబ్య్లు ఛైర్‌పర్సన్ రేఖాశర్మ స్పందించారు. సదరు వ్యక్తిపై తగు చర్యలకు తాము మహారాష్ట్ర పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. స్టార్‌యుజర్ అన్పించుకున్న ఈ వ్యక్తి టిక్‌టాక్ గుర్తింపును రద్దు చేయాలని కూడా సూచించారు. టిక్‌టాక్ స్టార్ అయి కూర్చున్న వ్యక్తి ఈ విధమైన వీడియోలను ప్రచారంలోకి తేవడం అనుచితం అని పలువురు మండిపడుతున్నారు. ఓ వ్యక్తి మహిళను అటకాయించి తిడుతూ మోసం చేసి వేరే వాడితో వెళ్లిపోయినందుకు అనుభవించు అంటూ దౌర్జన్యకర రీతిలో యాసిడ్ పోయడం వీడియోలో పదేపదే చూపించారు. ఈ వీడియోపై ట్విట్టర్ యుజర్ ఒకరు వెంటనే స్పందించి పత్రికలకు తెలియచేయడమే కాకుండా, ముంబై పోలీసులకు దీనిపై ఫిర్యాదు కూడా చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News