Friday, March 29, 2024

నేడు దేశవ్యాప్త సమ్మె

- Advertisement -
- Advertisement -

labor policies

 

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పిలుపు ఇచ్చిన
కార్మిక సంఘాలు, టిఆర్‌టిసి దూరం

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ నేడు(8వ తేదీ) దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్టు కేంద్ర కార్మిక సంఘాలు తెలిపారు. చట్టం సవరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా, జాతి వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మెలో కోట్లాదిమంది పాల్గొనబోతున్నట్టు సంఘాలు తెలిపాయి. ఎఐటియుసి, సిఐటియు, టియుసిసి, ఐఎన్‌టియుసి వంటి కార్మిక సంఘాలతో పాటు బ్యాంక్‌ల, రవాణా సంస్థలకు చెందిన ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెలో పాల్గొనపోతున్నాయని వెల్లడించాయి. జనవరి 2, 2020 రోజున జరిగన సమావేశంలో కార్మికుల న్యాయమైన డిమాండ్లపై భరోసా ఇవ్వడంలో కేంద్ర కార్మిక శాఖ విఫలమైందనీ, దీంతో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నేడు అఖిల భారత సమ్మె చేపట్టనున్నట్లు 10 కేంద్ర కార్మిక సంఘాలు ప్రకటించాయి. విద్యార్థి సంఘాలు, విశ్వవిద్యాలయాల సంఘాలు కూడా నేటి సమ్మెలో పాల్గొనబోతున్నాయని తెలిపాయి.

కేంద్ర ఇప్పటికే దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలైన ఎయిర్ ఇండియా, బిపిసిఎల్‌లను అమ్మేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు, ఇప్పటికే కేంద్రం 12 విమానాశ్రయాలను ప్రైవేటు పరం చేసిందని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. బిఎస్‌ఎన్‌ఎల్, ఎంటిఎన్‌ఎల్‌ల విలీనం తర్వాత అందులోని కార్మికులు ఉద్యోగాలను కోల్పోయినట్టు, ఇదే పద్దతిలో రైల్వే ప్రైవేటీకరణ, రక్షణ ఉత్పత్తుల తయారీ యూనిట్ల కార్పోరేటీకరణ, ప్రభుత్వ బ్యాంకుల విలీనాన్ని కూడా తాము వ్యతిరేకిస్తున్నట్టు కార్మిక సంఘాలు వివరించాయి. రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక తమ డిమాండ్లతో గ్రామీణ భారత్‌బంద్ పేరుతో ఈ సమ్మెకు మద్దతును ప్రకటించాయని వివరించాయి.

విద్యుత్ శాఖ యూనియన్ల డిమాండ్లు
ముఖ్యమైన డిమాండ్లు.. విద్యుత్ చట్టం 2003 సవరణను నిలిపివేయాలి. విద్యుత్ విభాగంలో ప్రైవేటీకరణ.ఫ్రాంచైజింగ్ పద్దతిని నిలిపివేయాలి. పాత పింఛను విధానాన్ని అమలుపరచాలి. పనికి తగిన వేతనం ఉండాలి. విద్యుత్ విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగులను, ఔట్‌సోర్సింగ్ వారిని క్రమబద్దీకరించాలి. సింగరేణిలో జాతీయ సంఘాలు ప్రచారం నిర్వహిస్తాయి. సర్వీసు 33 సం.లు పెడితే, సిగరేణిలో 80 శాతం మంది పదవీ విరమణ పొందాల్సిన పరిస్థితి. సింగరేణిలో కొత్త బ్లాక్‌లు ఇవ్వరాదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా కేంద్ర ప్భుత్వం ఆదేశాలు జారీచేసిందని సంస్థలో కొత్త ఉద్యోగాలు రావు. 100 శాతం పెట్టుబడులను ఆపడం, వాటాల అమ్మకాలు నిలిపివేయడం. వ్యవసాయ ఉత్పత్తులలో మద్దతు ధర ఇవ్వడం, నూతన పెన్ఫన్ రద్దు వంటివి సింగరేణికి సంబంధం లేనివని కార్మిక సంఘాలు వెల్లడించాయి. కార్మికుల న్యాయమైన హక్కులను కాపాడు కోవడానికి సమ్మెలో పాల్గొనాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి.

సమ్మెకు ఆర్‌టిసి దూరం!
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం దేశవ్యాప్త సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణలో ఆర్‌టిసి సమ్మెకు దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవలనే ఆర్‌టిసిలో సుదీర్ఘ సమ్మె జరిగిన తరువాత యూనియన్‌ల స్థానంలో ఉద్యోగుల సంక్షేమ మండలి ఏర్పాటైంది. సమ్మెకు సంబంధించి ఆర్‌టిసిలో ఎటువంటి సూచన, పిలుపు, చర్చగానీ లేదు. ఈ క్రమంలోనే దేశవ్యాప్త సమ్మెకు ఆర్‌టిసి దూరంగానే ఉంటుందని స్పష్టమవుతుంది. ఆర్‌టిసిలో త్వరలో ప్రారంభమయ్యే కార్గో సర్వీసులకు సంబంధించి ఏర్పాట్లపై అటు అధికారులు ఇటు ఉద్యోగులు నిమగ్నమై ఉన్నారు.

Nationwide protest against anti-labor policies
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News