Friday, March 29, 2024

నాటుకోళ్ల పెంపకంపై శిక్షణ

- Advertisement -
- Advertisement -
Natu Kolla Pempakam in Telangana
నాటుకోళ్ల పెంపకంతో జీవనోపాధి మెరుపరచుకోవాలి

పదరః నాటుకోళ్ల పెంపకంలో యాజమాన్య పద్ధతులు పాటిస్తూ గిరిజనులు జీవనోపాధిని మెరుగుపరచుకోవాలని కోనేరు సంస్థ ఫీల్డ్ కో ఆర్డినేటర్ సురేష్ గౌడ్‌అన్నారు. బుధవారం మండల పరిధిలోని చిట్లంకుంట గ్రామం ప్రశాంత్‌నగర్‌కాలనీలో చెంచులకు నాటుకోళ్ల పెంపకం, యాజమాన్య పద్ధతులపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కోనేరు సంస్థ ఫీల్డ్ కో ఆర్డినేటర్ సురేష్ గౌడ్ మాట్లాడుతూ… చెంచుల జీవనోపాదులను మెరుగుపరుచుకునేందుకు నాటుకోళ్లను పంపిణీ చేశామన్నారు. నాటుకోళ్ల పెంపకం, యాజమాన్య పద్ధతులపై ఏర్పాటు చేసిన శిక్షణను సద్వినియోగం చేసుకొని వాటి సంఖ్యను వృద్ధి చేసుకోని అదనపు ఆదాయాన్ని గడించాలని సూచించారు. అనంతరం కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కోళ్లలో వచ్చే సీజనల్ వ్యాధులను గుర్తించి ఏ విధమైన చికిత్స చేయించాలి అనే విషయాలను తెలిపారు. అనంతరం నాలుగో విడతలో భాగంగా 150 నాటుకోళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోనేరు సంస్థ ప్రాజెక్టు ఫీల్డ్ కో ఆర్డినేటర్ సురేష్ గౌడ్, ఇస్మాయిల్, గ్రామస్తులు పిన్నయ్య, వీరయ్య, ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News