Thursday, March 28, 2024

ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో ‘నాటు నాటు…’

- Advertisement -
- Advertisement -

ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు చేసి పలు రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ఆస్కార్స్‌లోని ‘బెస్ట్ ఓరిజినల్ సాంగ్’ విభాగంలో పోటీ పడేందుకు ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు నాటు’ సాంగ్ షార్ట్ లిస్ట్ కావడం విశేషం. ఈ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 81 పాటలు పోటీపడగా.. అందులో నుంచి టాప్ 15 పాటలను అవార్డుల కమిటీ ఎంపిక చేసింది. అందులో ‘నాటు నాటు’ పాటకి కూడా చోటు దక్కడం విశేషం.

ఈ 15 పాటల నుంచి కేవలం 5 పాటలు మాత్రం ఆస్కార్స్ అఫిషీయల్ నామినేషన్స్‌కి అర్హత సాధిస్తాయి. ఇక ఆస్కార్‌లో సత్తా చాటేందుకు ఆర్‌ఆర్‌ఆర్ మూవీతో కలిసి మొత్తం నాలుగు భారతీయ సినిమాలు నాలుగు విభాగాల్లో స్థానాలను దక్కించుకున్నాయి. ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో ‘లాస్ట్ ఫిల్మ్ షో’ (చెల్లో షో), బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి ‘నాటు నాటు’, ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో ‘ఆల్ దట్ బ్రీత్స్’, ఉత్తమ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విష్పరర్’ ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. షార్ట్ లిస్ట్‌లో ఎంపికైన చిత్రాలకు జనవరి 12 నుంచి 17 వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ ఓటింగ్ ఆధారంగా జనవరి 24న ఆస్కార్ నామినేషన్‌లో నిలిచిన సినిమాలను ప్రకటిస్తారు. అనంతరం మార్చి 12న విజేతలకు ఆస్కార్ అవార్డులు అందజేస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News