Home జిల్లాలు చిన్న జిల్లాలతో నవశకానికి నాంది

చిన్న జిల్లాలతో నవశకానికి నాంది

Lakshma-Reddyమహబూబ్‌నగర్: తెలంగాణ ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ నేతృత్వంలో తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, ఇందుకు వివిధ రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మరెడ్డి అన్నారు. మంగళవారం నూతనంగా ఏర్పడిన జోగుళాంబ గద్వాల జిల్లాను ప్రారంభించేందుకు గద్వాలకు వచ్చారు. ముందుగా కలెక్టర్, ఎస్పి నూతన కార్యాలయాలను జాతీయ జెండా ఎగురవేసి ప్రారంభించారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్ కార్యాలయంలో…మొదటిపేజీ తరువాయి… విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలోకి వెళ్లి అర్హులైన లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో దక్కలంటే పారదర్శకమైన పరిపాలన అవసరమని, దీనిని గుర్తించిన తమ అధినేత సిఎం కెసిఆర్ జిల్లాల పునర్విభజన ప్రక్రియను చేపట్టారు. నూతనంగా 21 జిల్లాలను ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం 31 జిల్లాలు ఏర్పడ్డాయి. చిన్న జిల్లాల వల్ల ప్రజలకు జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుందని, ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు ఎదురైనా వాటిని అప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామన్నారు. బంగారు తెలంగాణ దిశగా వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు దూసుకుపోతున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం చేపడుతున్న షాది ముబారక్, కల్యాణలక్ష్మీ, ఆసరా పింఛన్, డబుల్ బెడ్‌రూం, దళితులకు మూడెకరాల పొలం, మిషన్ కాకతీయ వంటి వివిధ రకాల అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల వల్ల నవశకానికి నాంది పలికినట్లు పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షను గుర్తించి వారికి దసరా కానుకగా జోగుళాంభ గద్వాల జిల్లాను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నడిగడ్డ జిల్లా ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కోన్నారు. అధేవిధంగా వైద్యశాఖలో నూతన మార్పులు తీసుకొచ్చి ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని రకాల చర్యలను చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో జెట్పీచైర్మన్ బండారిభాస్కర్, ఎంపీ నందిఎల్లయ్య, ఎమ్మేల్యేలు డీకే అరుణ, సంపత్‌కుమార్, శ్రీనివాస్‌గౌడు, కలెక్టర్ రజత్‌కుమార్‌షైనీ, ఎస్పీ విజయ్‌కుమార్, జేసీ డాక్డర్ గీత, తదితరులు పాల్గొన్నారు.
చిన్న జిల్లాలతోనే అభివృద్ధి
బాలానగర్: చిన్న జిల్లాలతోనే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని.. తద్వారా అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లకా్ష్మరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాల పునర్వి విభజనలో భాగంగా బాలానగర్ మండంలో నూతనంగా రాజాపూర్‌ను మండల కేంద్రంగా గుర్తించడంతో మంత్రి లకా్ష్మరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తహసీల్దార్, పోలీస్‌స్టేషన్, వ్యవసాయ, ఎంఆర్‌సి కార్యాలయాలను ప్రారంభింజచారు. అనంతరం రాజాపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాల పునర్వి విభజనతో ప్రజలకు మేలైన సేవలు అందుతాయన్న సిఎం కల నెరవేరడానికి ముందడుగు పడిందన్నారు. కార్యక్రమంలో జడ్పిటిసి పట్ల ప్రభాకర్ రెడ్డి, ఎంపిపి భాగ్యమ్మ, ఎస్సై నిరంజన్ రెడ్డి, జడ్చర్ల సిఐ గంగాధర్, బాలానగర్ తహసీల్దార్ రాంబాయి, ఉప తహసీల్దార్ విజయ్ కుమార్, రాజాపూర్ తహసీల్దార్ నర్సింగారావు, జడ్చర్ల ఎడిఎ నిర్మల, వ్యవసాయ అధికారి ప్రశాంత్ రెడ్డి, ఎంఇఒ శ్రీనాథ శర్మ, కృష్ణారెడ్డి, బాలానగర్ ఎంపిడిఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్, విఆర్‌ఒ నాగరాజు, ముఖ్యనేతలు మాజీ ఎంపిపి నర్సింలు, రాజాపూర్ మాజి సర్పంచ్‌లు గోపాల్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, వెంకటాచారి, ఆనంద్ గౌడ్, రఘువీర్ రెడ్డి, సత్తయ్య, బచ్చిరెడ్డి, వనపర్తి నర్సింలు, విజయ్ కుమార్, మల్లెపల్లి శ్రీశైలం, చెన్నారెడ్డి, వెంకట్‌రాంరెడ్డి, సర్పంచులు, పాల్గొన్నారు.
రాష్ట్రంలో సుపరిపాలన
నడిగడ్డ: సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ధర్మరాజు పాలన కొనసా గుతుందని, అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా నూతనంగా ఏర్పడిన జోగుళాంబ గద్వాల జిల్లాను ప్రారింభించేందుకు గద్వాలకు వచ్చారు. ప్రభుత్వం నిర్ణయించిన ముహుర్తానికి మొదటగా స్థానిక పిజెపి క్యాంపులో ఏర్పాటు చేసిన నూతన కలెక్టర్ కార్యాలయాన్ని పురోహితుల సమక్షంలో వేదమంత్రాలతో ప్రారంభించారు. అధేవిధంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పిజెపి కార్యాలయ వెనక భాగంలో నూతన ఎస్పి కార్యాలయాన్ని జాతీయ జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం గద్వాల పట్టణంలో టిఆర్‌ఎస్ ఇన్‌చార్జి బండ్లకృష్ణమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ ఊరేగింపు సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బృందం గుర్రం బగ్గీలో ర్యాలీగా వెళ్తూ అశేషంగా తరలివచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ పాత బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ చిన్న జిల్లాల ఏర్పాటు వల్ల ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడంతో పాటు, పారదర్శకమైన పాలన దక్కుతుందన్నారు. ముఖ్యంగా రెండు నదుల మధ్య వెలసిన దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నారు. ఇక్కడే జిల్లా కలెక్టర్,ఎస్పీ ఇతర జిల్లా అధికారులు మొత్తం అందుబాటులో ఉంటారు. కాబట్టి ప్రజలకు ఎలాంటి సమస్యలెదురైన తక్షణమే పరిష్కమవుతాయని పేర్కోన్నారు. అనంతరం జడ్పీచైర్మన్ భాస్కర్ మాట్లాడుతూ కృష్ణమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో గద్వాల జిల్లా కోసం తామందరం అధికార పార్టీలో ఉన్నప్పటికీ గట్టిగా పోరాటం చేసి జిల్లా సాధిం చుకున్నామన్నారు. కాని కొంతమంది స్థానిక నేతలు తామే జిల్లా తెచ్చా మని అబద్దాలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని కాంగ్రేస్ పార్టీ నేతలను ఉద్ధే శించి వ్యాఖ్యానించారు. ఎమ్మేల్యే శ్రీనివాస్‌గౌడు మాట్లాడుతు బంగారు తెలం గాణ సాధనలో తమ నేత సీఎం ముందుకెళ్తున్నారని పేర్కోన్నారు. జిల్లా సాధ నలో నడిగడ్డ ప్రాంతానికి చెందిన నేతలమంతా కలిసికట్టుగా పోరాటం చేసి సాధిం చుకున్నామని మాజీ ఎంపీ మంద జగన్నాథ్ పేర్కోన్నారు. గద్వాల నియో జకవర్గ ఇంఛార్జీ కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ…నడిగడ్డ ప్రాంతం గత పాల కుల పాలనలో పూర్తి నిర్లక్షం, దోపిడికి గురైందన్నారు. 2012 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఎక్కడా లేనంతగా గట్టు మంలంలో జనాభా తగ్గిందని ఆవే దన వ్యక్తం చేశారు. గడచిన 50ఏళ్లు ఒకే కుటుంబ పాలన సాగిందని వీరు ప్రజ లకు, ఈప్రాంతానికి తీరన అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. అధే విధంగా ఇక్కడ ఏపని జరిగిన ఇక్కడి నేతల అనుమతులు తీసుకుని వారికి క ప్పం చెల్లించిన తర్వాత జరగాలని ఆరోపించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ అధ్యక్షతన జరుగగా టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన గద్వాల అలంపూరు జట్పీటీసీలు, ఎంపఎంపీపీలు, గద్వాల మార్కెట్‌యార్డు అధ్యక్షురాలు లక్ష్మీదేవి, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు.