Thursday, April 25, 2024

నవ్వుకోవడానికి సమాయత్తమవ్వండి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నవీన్ పోలిశెట్టి హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థలు సంయుక్త నిర్మాణంలో ఓ చిత్రం రూపొందనుంది. అయితే ఆదివారం హీరో నవీన్ పోలిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా ప్రచార చిత్రం విడుదల చేసింది చిత్ర బృందం. కళ్యాణ్ శంకర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘ప్రేక్షకులుగా మీరు మరింత సరదాగా నవ్వుకోవడానికి సమాయత్త మవ్వండి. మేము వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాము’ అని ఈ సందర్భంగా ఫిల్మ్‌మేకర్స్ పేర్కొన్నారు. ఇక చిత్ర పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు.

Naveen Polishetty new movie poster released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News