Sunday, May 19, 2024

న్యూ ఇయర్ విషాదం.. కారుతో ఎస్ఐని ఢికొట్టిన తాగుబోతులు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్‌: కొత్త సంవత్సరం రోజున కొందరు యువకులు మద్యం మత్తులో రెచ్చిపోయి.. వాహనాలను తనిఖీ చేస్తున్న  ఎస్ఐని కారుతో వేగంగా ఢీకొట్టారు. దీంతో ఎస్ఐ కాలు విరిగింది. తీవ్ర గాయపడిన ఎస్ఐని తోటి సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన న్యూ ఇయర్ రోజున వికారాబాద్‌ జిల్లా అనంతగిరిలో చోటుచేసకుంది. వివరాల్లోకి వెళితే.. న్యూ ఇయర్ కావడంతో అనంతగిరి సమీపంలో నవాబ్‌పేట ఎస్ఐ కృష్ణ తన సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ కారు ఓవర్ స్పీడ్‌తో అటువైపుగా వచ్చింది. కొందరు యువకులు తప్పతాగిన నిర్లక్ష్యంగా కారు నడుపతుండడంతో. ఎస్ఐ కారును ఆపాడు.

అతి వేగంతో ఎందుకు నడుపుతున్నారని ప్రశ్నించడంతో రెచ్చిపోయిన యువకులు ఎస్ఐపై గొడవకు దిగారు. మత్తులో కోపంతో రగిలిపోయిన యువకులు కారుతో ఎస్ఐని ఢీకొట్టారు. అనంతరం పారిపోయే ప్రయత్నం చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నిందితులు టోలిచౌకికి చెందిన ఇమ్రాన్‌, అన్వర్‌, నవీద్‌, సమీర్‌లు అని వికారాబాద్‌ పోలీసులు గుర్తించారు.  తాజాగా ఈ ఘటనపై డిజిపి మహేందర్‌ రెడ్డి స్పందించారు. మద్యం సేవించి వాహనం నడిపిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, గాయపడిన ఎస్ఐ కృష్ణ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ప్రాణాలను పణంగా పెట్టి, తమ విధి నిర్వహిస్తున్న పోలీసులను ఈ సందర్భంగా డిజిపి అభినందించారు.

Nawabpet SI Krishna Injured after drunker hits with Car

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News