Tuesday, November 28, 2023

ఛత్తీస్‌గఢ్‌లో ఐఇడి పేలుడు: మావోయిస్ట్ మృతి

- Advertisement -
- Advertisement -

Naxal killed in IED blast in Chhattisgarh

రాయిపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఐఇడి పేలిన ఘటనలో ఓ మావోయిస్ట్ చనిపోయాడని బస్తర్ ఐజి పి.సుందర్‌రాజు తెలిపారు. శనివారం మిర్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గాయత్‌పరా గ్రామ సమీపంలోని రహదారిపై భద్రతా దళాలే లక్ష్యంగా ఐఇడిని అమర్చేందుకు ప్రయత్నిస్తుండగా పేలుడు జరిగిందని ఐజి తెలిపారు. ఈ ఘటనలో మావోయిస్ట్ పార్టీకి చెందిన మిలీషియా కమాండర్ సునీల్‌పదమ్ చనిపోయాడని ఐజి తెలిపారు. నెల రోజుల్లో ఇది రెండో ఘటనగా ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి 18న సోమ్జీ అనే మావోయిస్ట్ కంకేర్ జిల్లాలో ఐఇడిని అమర్చేందుకు యత్నిస్తూ మృత్యువాతపడ్డాడు.

Naxal killed in IED blast in Chhattisgarh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News