Home తాజా వార్తలు ఆదిభట్లలో నయీం భూదందా

ఆదిభట్లలో నయీం భూదందా

nayeemmmmహైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం హతమైన తర్వాత అతడి అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. లెక్కలేనన్ని హత్యలు, భూదందాలు, సెటిల్‌మెంట్లు చేసిన నయీం నేరాల చిట్టా పెద్దదే. మూడేళ్ల క్రితం ఆదిభట్ల సమీపంలో నయీం ముఠా సాగించిన భూదందాకు సంబంధించి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మంగళ్‌పల్లి, ఆదిభట్ల సమీపంలోని ఓ రైతుకు చెందిన 21 ఎకరాల భూమిపై నయీం కన్నుపడింది. దీంతో అతడికి చెందిన మహిళా ముఠా సభ్యులు రైతును శతవిధాలా బెదిరించి భూమిని లాక్కునేందుకు ప్రయత్నించి.. తుపాకులతో బెదిరించినట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. అయితే ఆ రైతు ఎదురుతిరిగి ముఠా సాగిస్తున్న భూదందాకు అడ్డుపడినట్లు సమాచారం.