Friday, April 26, 2024

ఆర్యన్ కేసులో కొత్త మలుపు

- Advertisement -
- Advertisement -
NCB asked SRK for Rs 25 cr to free Aryan
షారుక్ ఖాన్‌ను రూ.25కోట్లు డిమాండ్ చేశారు
 తెల్లకాగితాలపై బలవంతంగా సంతకం చేయించుకోబోయారు,  క్రూయిజ్ షిప్ కేసులో సాక్షి సంచలన ఆరోపణ
 మహారాష్ట్ర పరువు తీసేందుకు ఎన్‌సిబి కంకణం : శివసేన ఎంపి రౌత్
 షారుక్ బిజెపిలో చేరితే డ్రగ్స్ పంచదార అవుతుంది : ఎన్‌సిపి మంత్రి

ముంబయి: క్రూయిజ్ షిప్ మాదకద్రవ్యాల వ్యవహారం కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ వ్యవ హారంలో సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్ అనే వ్యక్తి ద ర్యాప్తు సంస్థ ఎన్‌సిబిపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న గోసవీ, ఎన్‌సిబి మధ్య రహస్య ఒప్పందం నడించిందని ఆరోపణలు చేశారు. రూ.25 కో ట్లు అందజేస్తే ఆర్యన్‌ను విడిచిపెడతామని షారుక్ ఖాన్ ను ఎన్‌సిబి అధికారి, పలువురు డిమాండ్ చేశారని ఆరో పించారు. ఈ కేసు దర్యాప్తులో కీలక అధికారి సమీర్ వాంఖడేకు అందులో కొంత మొత్తం ఇవ్వాల్సి ఉంటుం దని ప్రయివేట్ డిటెక్టివ్ గోసవి ఫోన్‌లో శామ్ డిసౌజాతో చెప్పడం తాను విన్నట్లు సాక్షి ప్రభాకర్ చెప్పారు. ఈ సం భాషణ తర్వాత గోసవి, డిసౌజా, షారుఖ్‌ఖాన్, పూజా ద ద్లాని ఒక కారులో కూర్చోని 15 నిమిషాల పాటు మాట్లా డుకున్నట్లు ప్రభాకర్ తెలిపారు. అంతేకాకుండా ఈ డ్రగ్స్ కేసులో తనతో తొమ్మిది, పది తెల్ల కాగితాలపై బలవం తంగా సంతకం చేయించుకోబోయారని ఆరోపించాడు.

షారుక్‌ఖాన్ తనయుడు ఆర్యన్‌ఖాన్ సహా పలువురు అరె స్టయి ముంబయి క్రూయిజ్ డ్రగ్స్ కేసులో తొమ్మిది మం దిని ఎన్‌సిబి సాక్షులుగా పేర్కొంది. వారిలో ప్రైవేట్ డిటె క్టివ్ కె.పి. గోసవి ఒకరు. ఇందులో భాగంగా గోసవి బాడీ గార్డుగా చెప్పుకుంటున్న ప్రభాకర్ సెయిల్‌ను ఎన్‌సిబి వి చారించింది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ సెయిల్ ఎన్‌సిబి దాడులతోపాటు ఈ డ్రగ్స్ వ్యవహారంపైస సంచలన ఆరో పణలు చేశారు. సమీర్ వాంఖడే నుంచి తనకు ముప్పు పొంచి ఉందని ఆరోపించారు. క్రూయిజ్‌పై దాడి జరిగిన తర్వాత ఎన్నో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నా యని పేర్కొన్నాడు. వీటికి సంబంధించిన వీడియోలు , ఆ ధారాలు తన దగ్గర ఉన్నాయంటూ నార్కొటిక్ డ్రగ్స్ కో ర్టులో అఫిడవిట్ సమర్పించారు. దీంతో ఈ కేసు దర్యాప్తు మరిన్ని మలుపులకు దారితీస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో ఆర్యన్‌ఖాన్‌తో గోసవి సంబంధంపై ఎన్‌సిబి దృష్టిపెట్టింది. ప్రస్తుతం గోసవి పరారీలో ఉన్నాడు.

శివసేన ఎంపి రౌత్ తీవ్ర ఆరోపణలు

ఎన్‌సిబిపై శివసేన ఎంపి సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ కేసులో అరెస్టయిన వారి నుంచి ఎన్‌సిబి డ బ్బులు అడుగుతున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని తె లిపారు. తెల్లకాగితాలపై ఎన్‌సిబి సాక్షుల సంతకాలు తీ సుకుంటోందని ఆరోపించారు. దీనిపై పోలీసులు దర్యా ప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర హోం మంత్రి దిలిప్ వాల్సే పాటిల్‌ను కోరారు. మహారాష్ట్ర ప్రభు త్వాన్ని అప్రతిష్ట పాల్జేసేందుకు ప్రయత్నాలు కొనసాగు తున్నట్లు సిఎం ఉద్దవ్ ఠాక్రే భావిస్తున్నారని ట్వీట్ చేశా రు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఇం దులో ఎన్‌సిబి కార్యాలయంలో గోసవి, ఆర్యన్‌ఖాన్ చేత ఫోన్లో మాట్లాడిస్తున్నట్లు ఉంది. ప్రభాకర్ సెయిల్ ఆరోప ణలు చేసిన కాసేపటికే సంజయ్ రౌత్ ఈ ఆరోపణలు చే యడం గమనార్హం. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ బిజెపి లో చేరితే డ్రగ్స్ చక్కెర అవుతుందని మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సిపి సీనియర్ నేత చగన్ భుజ్‌బుల్ ఆసక్తికర వ్యాఖ్య లు చేశారు. గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో 3వేల కిలో ల మాదకద్రవ్యాలు పట్టుబడితే చర్యలు శూన్యమని, ముంబైలో కాస్త పట్టుబడితే రచ్చ చేస్తున్నారని, ఇదంతా ముంబై పేరును మసకబార్చే కుట్ర అని ఆయన ఆరో పించారు.

ఆరోపణలను తోసిపుచ్చిన ఎన్‌సిబి

ప్రభాకర్ సెయిల్ చేసిన ఆరోపణలను ఎన్‌సిబి తోసిపు చ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ముడుపుల వ్యవహారం జరిగితే కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఇంకా జైలులోనే ఎందుకుంటారని, దర్యాప్తు కార్యాలయంలో సిసి కెమె రాలు ఉన్నాయని, అటువంటి సంఘటనలు జరిగే ఆస్కా రమే లేదని, కేవలం దర్యాప్తు సంస్థ ప్రతిష్టను దెబ్బతీయ డానికి ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఎన్‌సిబి అధికారులు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News