Thursday, April 25, 2024

దీపికను విచారించిన ఎన్‌సిబి అధికారులు

- Advertisement -
- Advertisement -

NCB officers interrogate Deepika Padukone

ముంబై: బాలీవుడ్ డ్రగ్స్  కేసు విచారణ జరుగుతోంది. శనివారం ఉదయమే దీపిక పదుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్‌ నేషనల్ నార్కోటిక్స్ బ్యూరో (ఎన్‌సిబి) కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. దీపికాకు, కరిష్మా ప్రకాశ్ మధ్య చాటింగ్ పై అధికారులు ప్రశ్నించారు. కరిష్మాతో సాధారణ సంబంధాలు తప్ప.. డ్రగ్స్ సంబంధాలు లేవని దీపికా పేర్కొంది. అయితే విచారణలో భాగంగా దీపిక చెప్పిన సమాధానాలతో ఎన్‌సిబి అధికారులు అసంతృప్తికి గురయ్యారు. శ్రద్ధను మరో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో బృందం ప్రశ్నిస్తోంది.

శ్రద్ధ,జయసాహాకు మధ్య చాటింగ్ పై ఎన్‌సిబి అధికారులు నిలదీస్తున్నారు. మరోవైపు 2019 నాటి కరణ్ జోహార్ డ్రగ్ పార్టీపై అధికారులు దృష్టి సారించారు. అయితే తానెప్పుడూ డ్రగ్స్ సప్లై చేయలేదని కరణ్ జోహార్ బుకాయించారు. రేపో మాపో కరణ్ జోహార్  కు కూడా నోటీసులు ఇవ్వనుంది నేషనల్ నార్కోటిక్స్ బ్యూరో. టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విచారణ నిన్ననే ముగిసింది. దీపికా, శ్రద్ధాల విచారణ ముగిశాక మరోసారి రకుల్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. విచారణలో తానెప్పుడూ డ్రగ్స్ వాడలేదని రకుల్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News