Home తాజా వార్తలు 2న అమెజాన్ పిటిషన్‌పై ఎన్‌సిఎల్‌ఎటి విచారణ

2న అమెజాన్ పిటిషన్‌పై ఎన్‌సిఎల్‌ఎటి విచారణ

NCLAT to hear amazon petition against CCI order on feb 2

 

న్యూఢిల్లీ : ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఎఫ్‌సిపిఎల్)తో రెండేళ్ల డీల్‌ను రద్దు చేస్తూ రెగ్యులేటర్ సిసిఐ ఆదేశాలు జారీ చేయడాన్ని అమెజాన్ సవాల్ చేసింది. వచ్చే 10 రోజుల్లో తమ స్పందన తెలియజేయాలంటూ సిసిఐ, ఎఫ్‌ఎస్‌పిఐకు ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై నేషనల్ కంపెనీ లా అప్పిల్లేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌ఎటి) ఫిబ్రవరి 2న విచారణ జరుపనుంది. ఈ నెల 9న సిసిఐ ఆర్డర్‌ను సవాల్ చేస్తూ ఎన్‌సిఎల్‌ఎటిలో అమెజాన్ సవాల్ పిటిషన్ దాఖలు చేసింది. ఫ్యూచర్ కూపన్స్‌తో డీల్‌కు సంబంధించిన రెండేళ్ల ఒప్పందాన్ని సిసిఐ ఇటీవల రద్దు చేసింది. 2019లో అమెజాన్ కుదుర్చుకున్న 49 శాతం వాటా ఒప్పందాన్ని సిసిఐ రద్దు చేస్తూ ఆదేశాలిచ్చింది. అదే సమయంలో ఇకామర్స్ దిగ్గజం అమెజాన్‌పై రూ.202 కోట్ల జరిమానా కూడా విధించింది. రిలయన్స్‌తో 3.4 బిలియన్ డాలర్ల డీల్‌లో ఫ్యూచర్ గ్రూప్ నిబంధనలను ఉల్లంఘించిందంటూ అమెజాన్ చాలాకాలంగా న్యాయ పోరాటం చేస్తోంది.