Home తాజా వార్తలు దివాలా అవాస్తవం

దివాలా అవాస్తవం

NCLT admits insolvency plea against OYO entity

 

ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్

న్యూఢిల్లీ : దివాలా కోసం ఆతిథ్య సంస్థ ఓయో దరఖాస్తు చేసిందనే వార్తలను బుధవారం కంపెనీ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ ఖండించారు. ట్విట్టర్ ద్వారా ఆయన విషయాన్ని ప్రకటించారు. ‘దివాలా కోసం ఓయో దరఖాస్తు చేసిందంటూ పిడిఎఫ్, టెక్ట్ మెసేజ్‌ను సర్కులేట్ అవుతోంది. ఇది ఏమాత్రం నిజం కాదు’ అని ట్విట్టర్‌లో రితేష్ తెలిపారు. రితేష్ వివరిస్తూ, బకాయిలను చెల్లించడం లేదంటూ ఓయోకు చెందిన అనుబంధ సంస్థ నుంచి ఆపరేషనల్ క్రెడిటార్ రూ.16 లక్షలను కోరగా, దీనిపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) పిటిషన్‌ను తీసుకుందని అన్నారు. దీనిపై ఓయో ఎన్‌సిఎల్‌ఎటి (నేషనల్ కంపెనీ లా అప్పీల్లేట్ ట్రిబ్యునల్)లో సవాలే చేశామని ఆయన వివరించారు.

NCLT admits insolvency plea against OYO entity