Friday, March 29, 2024

భారత ట్విట్టర్‌కు ఎన్‌సిపిసిఆర్ నోటీసు

- Advertisement -
- Advertisement -

NCPCR notice to Indian Twitter

న్యూఢిల్లీ : భారత ట్విట్టర్‌పై జాతీయ పిల్లల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సిపిసిఆర్) చర్యలకు పూనుకుంది. ఇటీవలే ఢిల్లీలో హత్యాచారానికి గురైన దళిత బాలిక, ఆమె కుటుంబసభ్యులను గుర్తుపట్టేలా ఫోటోను కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పోస్టు చేశారు. దీంతో భారత ట్విట్టర్‌కు ఎన్‌సిపిసిఆర్ నోటీసు ఇచ్చింది. దళిత బాలికపై హత్యాచారం, బలవంతంగా అంత్యక్రియలపై ఢిల్లీలో తీవ్ర దుమారం, నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ బుధవారం ఉదయం బాధితురాలి కుటుంబసభ్యులను ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఓల్డ్ నాన్గల్ గ్రామానికి వెళ్లి పరామర్శించారు.

బాధితురాలి కుటుంబసభ్యుల మొహాలు కనపడేలా, వాహనం పక్కనే వారితో మాట్లాడుతున్న ఫోటోను కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ పోస్టుపై పోస్కో చట్టం కింద ఎన్‌సిపిసిఆర్ విచారణ చేపట్టి ట్విట్టర్ ఇండియాకు నోటీసు ఇవ్వడంతో రాహుల్ గాంధీ తన ఖాతా నుంచి ఆ పోస్టును తొలగించారు. బాలిక తల్లిదండ్రుల ఫోటో చూపించడం ద్వారానే బాధిత బాలిక గుర్తింపులను వెల్లడిస్తుందని ఫిర్యాదు ఉన్నట్టు ట్వీట్టర్ ఇండియా రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారిని ఉద్దేశించి బాలల హక్కుల సంఘం పేర్కొంది. ఎన్‌సిపిసిఆర్ ప్రతిస్పందిస్తూ బాధితుడు లేక బాధితురాలి వివరాలు వెల్లడిస్తే మీడియా కానీ, ఏదైనా పబ్లిష్ చేసినా, లేక ఫోటోగ్రాఫర్‌పై జువైనల్ జస్టిస్ చట్టం,పోస్కో చట్టం కింద చట్టవిరుద్ధమవుతుందని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News