Home తాజా వార్తలు ఎన్‌డిఎ అంటే ‘నో డేటా అవైలబుల్’

ఎన్‌డిఎ అంటే ‘నో డేటా అవైలబుల్’

NDA means, No Data Available says Minister KTR

ప్రధాని ఇస్తానన్న 12 కోట్ల ఉద్యోగాల సమాచారం కోసం వెతుకుతున్నా?, ఎక్కడా కనిపించడం లేదు
బిజెపి ఎంఎల్‌సి అభ్యర్థి రాంచందర్‌రావు ట్వీట్‌కు మంత్రి కెటిఆర్ ప్రతి ట్వీట్
ఉద్యోగాలపై టిఆర్‌ఎస్, బిజెపి మధ్య ట్విట్టర్ వార్

మన తెలంగాణ/హైదరాబాద్: ఉద్యోగాల కల్పనపై శాఖల వారీగా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర వివరాలను అందించింది. దీనిపై ఎవరికైనా సందేహాలున్నా.. కాదని నిరూపించాలనుకుంటే తాను ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధమని మంత్రి కెటిఆర్ ఇటీవల సవాల్ కూడా విసిరారు. దీనిపై బిజెపి సిట్టింగ్ ఎంఎల్‌సి అభ్యర్ధి రాంచందర్‌రావు స్పందిస్తూ, ఉద్యోగాలపై చర్చించడానికి తాను సిద్ధమని, దీనికోసం ఉస్మానియా యూనివర్సిటికి రావాల్సిందిగా కెటిఆర్‌కు ప్రతి సవాల్ విసిరారు. ఈ మేరకు కెటిఆర్ ఎక్కడ ఉన్నారంటూ రాంచందర్ రావు ట్వీట్ చేశారు.

దీనికి స్పందించిన కెటిఆర్ మోదీ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలపై సమాచారం సేకరిస్తున్నట్లు రాంచందర్‌రావుకు రీట్వీట్ చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారని.. ప్రధాని ఇస్తానన్న 12 కోట్ల ఉద్యోగాల సమాచారం సేకరిస్తున్నట్లుగా పేర్కొన్నారు. జన్‌ధన్ ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున వేస్తామన్నారు…కనీసం దీనిపైనా సమాచారం చెప్పగలారా? అని ప్రశ్నించారు. 12 కోట్ల ఉద్యోగాలు, రూ.15 లక్షల సాయంపై సమాచారం తెలిస్తే రాంచందర్‌రావు చెప్పాలని కెటిఆర్ ట్విట్టర్‌లో డిమాండ్ చేశారు.

NDA means, No Data Available says Minister KTR