Friday, March 29, 2024

టీకా రెండు డోసులు తీసుకున్నా మాస్క్ తప్పనిసరి..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్లను ఇప్పుడున్న వ్యాక్సిన్లు ఏమేరకు నియంత్రించగలవో ఇంకా స్ఫష్టం కాలేదు. ఈ పరిస్థితుల్లో టీకా రెండు డోసులు తీసుకున్నా సరే మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా సూచించారు. కొత్త వేరియంట్లపై ఏ వ్యాక్సిన్ సామర్ధం ఎంతో తెలియక పోయినా ఏ వేరియంట్ నుంచైనా మాస్కులు, భౌతిక దూరం రక్షిస్తాయని చెప్పారు. ఇదే విధంగా టీకా తీసుకున్నవారు మాస్కులు ధరించనక్కర లేదన్న అంశాన్ని ఇప్పుడిప్పుడే మార్గదర్శకాల్లో చేర్చలేమని కేంద్ర ఆరోగ్యశాఖ లోని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. కరోనా టీకాలు తీసుకున్న వారు ఇక నుంచి మాస్కులు ధరించ వలసిన అవసరం లేదని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సిడిసి) ప్రకటించింది. టీకా రెండు డోసులు తీసుకున్న వారు తమ కార్యకలాపాలను యధేశ్చగా కొనసాగించుకోవచ్చని తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలోనూ భారత్‌లో రెండు డోసులు తీసుకున్నవారు మాస్కులు ధరించవలసిన అవసరం ఉందా లేదా అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో గులేరియా పై విధంగా సూచనలు చేశారు.

Need Mask Even fully Vaccinated: AIIMS Chief

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News