Home ఆంధ్రప్రదేశ్ వార్తలు ఎపి సిఎస్‌గా నీలం సహాని నియామకం

ఎపి సిఎస్‌గా నీలం సహాని నియామకం

Neelam Sahani

 

మనతెలంగాణ/హైదరాబాద్: ఎపి సిఎస్‌గా నీలం సాహాని బుధవారం నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1984 బ్యాచ్ ఎపి క్యాడర్‌కు చెందిన ఆమెను కేంద్ర సర్వీసుల నుంచి ఇటీవలే రిలీవ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ముఖ్య కార్యాదర్శి (పొలిటికల్) ప్రవీణ్ ప్రకాశ్ ఉత్వర్వులను జారీ చేశారు. ఎల్ వి సుబ్రహ్మణ్యం బదిలీ తరువాత సిసిఎల్ ఎ నీరబ్ కుమార్‌కు సిఎస్‌గా బాధ్యతలు అప్పగించారు. తాజాగా నీలం సహాని నియామకంతో సిఎస్ బాధ్యతల నుంచి ఆయనను రిలీవ్ చేశారు.

Neelam Sahani Appointment As AP New CS