Thursday, April 25, 2024

ఈ సీజన్‌కు ముగింపు పలుకుతున్నా

- Advertisement -
- Advertisement -

Neeraj Chopra ends 2021 season

పూర్తిగా అలసి పోయా..విశ్రాంతి అవసరం
స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా

న్యూఢిల్లీ: టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన యువ అథ్లెట్ నీరజ్ చోప్రా 2021 సీజన్‌కి ముగింపు పలికేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని నీరజ్ చోప్రా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఒలింపిక్స్ కోసం చాలా ఏళ్లుగా తీవ్రంగా శ్రమించానని, దీంతో పూర్తిగా అలసి పోయానని తెలిపాడు. ఇక ఈ ఏడాది పెద్దగా టోర్నమెంట్‌లు కూడా లేక పోవడంతో సీజన్ మొత్తానికి విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలిపాడు. ఇక టోక్యో నుంచి వచ్చిన తర్వాత తాను తీరిక లేకుండా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుందన్నాడు. దీని ప్రభావం తన ఆరోగ్యంపై కూడా పడుతుందన్నాడు. దీంతో కొంత కాలం ఆటకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు వివరించాడు. ఈ ఏడాదికి ఇంతటితో ముగింపు పలికి మళ్లీ రిచార్జ్ అవ్వాలనుకుంటున్నా అని తెలిపాడు. ఇక వచ్చే ఏడాది జరిగే వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లో సమరోత్సాహంతో బరిలోకి దిగుతానని నీరజ్ పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News