Wednesday, April 24, 2024

‘నీట్’లో భారీ స్కామ్

- Advertisement -
- Advertisement -
NEET fraud in maharashtra
మహారాష్ట్ర కోచింగ్ సెంటర్ అక్రమాలు
 అభ్యర్థికో అరకోటి, నకిలీలతో పరీక్షలు : సిబిఐ నిర్థారణ

న్యూఢిల్లీ : నీట్ మెడికల్ పరీక్షలలో భారీ స్కాం జరిగినట్లు తాము గుర్తించామని సిబిఐ వర్గాలు గురువారం తెలిపాయి. పరీక్షలలో పాస్ అయ్యేందుకు వేరే అభ్యర్థుల తో పరీక్షలు రాయించడం ఇందుకు ప్రతి అభ్యర్థికి నుంచి రూ 50 లక్షలు పొందడం వంటి పరిణామాలు జరిగినట్లు సిబిఐ గుర్తించింది. నీట్ ద్వారా వైద్య కాలేజీలలో సీట్లకు ఈ విధంగా ముడుపులు పొందే ముఠా స్కామ్ వెలుగులోకి రావడం కలక లం సృష్టించింది. ముందుగా నిఘావర్గాల కు ఈ తంతు గురించి తెలియడంతో పరీ క్షా కేంద్రాల వద్ద మఫ్టీలో అధికారులు ఉం డటంతో ఈ స్కామ్‌ను కొంతమేర ముం దుగానే నివారించినట్లు సిబిఐ వర్గాలు చె పుతున్నాయి. అయితే పూర్తిస్థాయి దర్యాప్తు జరిగితే కానీ నీట్ పరీక్ష వెనుక నిజాలు తెలియవని విద్యావంతులు పేర్కొంటున్నారు. నీట్ పరీక్షలకు సంబంధించి తమిళనాడు ఇతర ప్రాంతాలలో విద్యార్థుల ఆత్మహత్యల కలకలం నేపథ్యంలో సిబిఐ ఈ విషయాన్ని తెలిపింది.

ప్రతిభావంతులైన విద్యార్థులు సరైన ఫలితాలు రాకపోవడాన్ని తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్న సం దర్భాలు ఉన్నాయి. ఇదిభారీ స్థాయి రాకె ట్ అయింది. సంబంధిత ఉదంతంతో మ హారాష్ట్రకు చెందిన కోచింగ్ సెంటర్ ఆర్‌కె ఎడ్యుకేషన్ కేరీర్ గైడెన్స్ , దీని డైరెక్టర్ పరిమళ్ కొట్పలివార్ పలువురు విద్యార్థులు పాల్గొన్నట్లు ప్రాధమికంగా తేలింది. దీని తో స్కామ్‌కు సంబంధించి వీరిపై అభియోగాలు మోపారని సిబిఐ తెలిపింది. వైద్య కళాశాలల్లో ప్రవేశాలు వచ్చేలా చేస్తామని పేర్కొంటూ తమను కలిసిన విద్యార్థులతో బేరాలు కుదుర్చుకుని వారి బదులుగా ఇతరులతో పరీక్షలు రాయించారని సిబిఐ ఆ రాలో తేలింది. ఇప్పుడిది విద్యాపరంగా అ త్యంత భారీ కుంభకోణం అయింది. గత రెండు మూడు రోజుల క్రితమే సిబిఐ సం బంధిత అంశంపై ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేసింది. ఇవి గురువారం వెలుగులోకి వ చ్చాయి. పలు అక్రమ పద్ధతులు అన్నింటికి మించి వెలుపల ఉండే ప్రతిభావంతులను సరిగ్గా చదవలేని విద్యార్థుల బదులుగా పరీక్షలు రాయించారని ఇతర అక్రమమార్గాలకు పాల్పడ్డారని సిబిఐ తొలి దశలో నిర్థారించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News