Home స్కోర్ నేగికి జాక్‌పాట్ 

నేగికి జాక్‌పాట్ 

333333ఢిల్లీ స్పిన్ ఆల్‌రౌండర్‌కు రూ.8.5 కోట్లు
షేన్‌వాట్సన్‌కు రూ.9.5 కోట్లు
సన్‌రైజర్స్‌కు యువీ, నెహ్రా
అమ్ముడుపోని గుప్టిల్, ఖవాజా
న్యూఢిల్లీ : ఢిల్లీ రంజీ ప్లేయర్ పవన్ నేగిపై కాసుల వర్షం కురిసింది. త్వరలో శ్రీలంకతో జరిగే మూడు టీ-20ల సిరీస్‌తో పాటు ఆసియాకప్, టీ-20 ప్రపంచకప్‌కు ఎంపికైన పవన్‌నేగి శనివారం జరిగిన ఇండియన్ ప్రిమియర్ లీగ్ తొమ్మిదో ఎడిషన్ వేలంలో ఏకంగా రూ.8.5 కోట్లు సొంతం చేసుకున్నాడు. కెరీర్‌లో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని నేగిని సొంతం చేసుకోవడానికి అన్ని జట్లూ తీవ్రంగా పోటీపడినా.. చివరికి తనను ఐపిఎల్‌కు పరిచయం చేసిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కి సొంతమయ్యాడు. ఈ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న భారత క్రికెటర్ నేగినే కావడం విశేషం. నేగి కంటే ఎక్కువ మొత్తం ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్‌వాట్సన్‌కు దక్కింది. ఫామ్‌లేమీతో ఆస్ట్రేలియా జాతీయ జట్టులో చోటు కోల్పోయిన వాట్సన్‌కు భారత్‌తో జరిగిన టీ-20 సిరీస్‌లో శతకం బాదడం కలిసివచ్చింది. బౌలింగ్, బ్యాటింగ్ సత్తాచాటే వాటన్ రాయల్ ఛాలెంజర్స్ దక్కించుకుంది. ఇక గతేడాది రూ.16 కోట్లు సొంతం చేసుకున్న యువరాజ్‌కు ఈసారి రూ.7 కోట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. యువీని సొంతం చేసుకోవడానికి బెంగళూరు పోటీపడినా చివరికి సన్‌రైజ్ హైదరాబాద్ రూ.7 కోట్లకు సోంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరీస్‌ను కూడా రూ.7 కోట్లకే ఢిల్లీ డేర్‌డెవిల్స్ కొనుగోలు చేయగా, మోహిత్‌శర్మను రూ.6.5 కోట్లకు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, ఆశీష్ నెహ్రాను రూ.5.5 కోట్లకు సన్‌రైజర్స్‌హైదరాబాద్ సొంతం చేసుకుంది.
ఊహించని ధర : ఈసారి వేలంలో కొందరు దేశవాళీ ఆటగాళ్లు ఊహించని మొత్తాన్ని సొంతం చేసుకున్నారు. ఈ జాబితాలో తమిళనాడు లెగ్‌స్పిన్నర్ మురుగన్ అశ్విన్ ముందు వరుసలో ఉన్నాడు. తమిళనాడు తరుపున మూడే ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న మురుగన్‌ను రూ.4.5 కోట్లకు రైజింగ్ పునె సూపర్ గైంట్స్ కోనుగోలు చేసింది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సోదరుడు క్రునల్ పాండ్యా(ముంబయి ఇండియన్స్) రూ.2 కోట్లు సొంతం చేసుకోగా, కర్ణాటక ప్రిమియర్ లీగ్‌లో సత్తాచాటిన కిశోర్ కామత్(ముంబయి ఇండియన్స్) రూ.1.4 కోట్లు దక్కించుకున్నాడు. ఇక రాజస్థాన్ తరుపున సత్తాచాటిన దీపక్ హూడాను రూ.4.2 కోట్లకు రైజింగ్ పునె, సంజూశాంసన్‌ను రూ.4.2 కోట్లు, కరుణ్‌నాయర్‌ను రూ.4 కోట్లకు ఢిల్లీ డేర్‌డెవిల్స్ కొనుగోలు చేశాయి. అండర్-19 వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ రూ.1.9 కోట్లు దక్కించుకున్నాడు. ఇక వెస్టిండీస్ యువ బ్యాట్స్‌మెన్ కార్లోస్ బ్రాత్‌వైట్‌కూ ఊహించని ధర దక్కింది. అంతర్జాతీయ టీ-20ల్లో ఒక్క అర్ధశతకం కూడా నమోదుచేయని బ్రాత్‌వైట్‌పై ఢిల్లీ రూ.4.2 కోట్లు ఖర్చుచేసింది.
పాపం గప్టిల్ : గతేడాదిగా పరిమిత ఓవర్ల మెరుపు ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోతున్న కివీస్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్‌కు ఈసారి వేలంలో నిరాశే ఎదురైంది. రూ.50 లక్షలు కనీస ధరతో వేలంలోకి వచ్చిన గుప్టిల్‌ను కొనుగోలుచేయడానికి ఏ ఒక్క ఫ్రాంచైజీ ఆసక్తిచూపలేదు. ఇక ఆస్ట్రేలియా లెఫ్టార్మ్ బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖవాజాకు చుక్కెదురైంది. తాను ఆడిన చివరి పది ఇన్నింగ్స్‌ల్లో(బిగ్‌బాస్ లీగ్, వన్డే, టెస్టులు) ఆరు శతకాలు నమోదుచేసిన ఖవాజా రూ. ఒక కోటి కనీస ధరతో వేలంలో నిలిచాడు. ఇక వెటరన్ ప్లేయర్లు మహేళ జయవర్ధనే, మైకేల్ హస్సీతో పాటు హసీమ్ ఆమ్లా, రొసౌ, ప్రజ్ఞాన్ ఓజా, మనోజ్ తివారి, మునాఫ్ పటేల్, తిలక్ రత్నే దిల్షాన్, డారెన్‌సామీ, నువన్ కులశేఖర, అజంతా మోండీస్‌కు మొడిచేయి ఎదురైంది.