Wednesday, March 29, 2023

పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

- Advertisement -

hall

* జిల్లా కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణన్

మన తెలంగాణ/సంగారెడ్డి ప్రతినిధి : పంచాయతీ రాజ్ శాఖ వివిధ మండలాల్లో చేపడుతున్న పనులను సకాలంలో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణన్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్ శాఖ సంగారెడ్డి, అందోల్ సర్కిల్ అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పురోగతిలో ఉన్న పనులను ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. స్థానికంగా ఉండి ఏఈలు పని పురో గతి విధిగా పర్యవేక్షించాలని సూచించారు. ఈ విషయంలో నిర్లక్షం వహిస్తే చర్యలు తప్పవన్నారు. పరిపాలన అనుమతులు వచ్చిన వెంటనే పనులు చేపట్టాలే తప్ప ఏదో ఒక సాకుతో పనులు ప్రారంభించకపోతే ఊరుకునేది లేదన్నారు. మండలం వారిగా ఎన్ని పనులున్నాయి, ఎన్నింటికి పరిపాలన అనుమతి వచ్చింది, ఎన్నింటికి టెండర్ కాలేదు, ఏఏ పనులు పురోగతిలో ఉన్నాయనే వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ వెంటనే చే యాలని అధికారులకు ఆదేశించారు. మండలం వారికగా ఏ  పని ఏలా నడుస్తుందో సంబంధిత ఈఈ క్షేత్రస్థాయి అధికారులతో సువివరంగా సమీక్షించారు. ప్రతి నెల చివరి పని దినం రోజు ఎన్ని పను లు పూర్తయ్యాయి.. మంజూరయ్యాయి.. టెండర్ల ఫైనలైజ్ అయ్యా యి.. వర్క్ ఆర్డర్ ఎన్నింటికి ఇచ్చాం అనే విషయాలను క్రోడికరిస్తూ నివేదిక రూపొందించి పంపాలన్నారు. పనులు పురోగతిలో ఉన్న వాటికి సంబంధించి ఫోటో తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. పురోగతిలో ఉన్న పనులను స్థానిక ఏఈలు పని జరుగుతున్న ప్రదేశాన్ని సందర్శించి పనులు పర్యవేక్షించాలన్నారు. ఆయా మండలా ల్లో ఏదైన పని ఆగినట్లైతే, పని ఆగడానికి గల  కారణాలు తెలుసుకుని తమ దృష్టికి తీసుకు వస్తే పనులు తిరిగి ప్రారంభమయ్యేందుకు చర్యలు తీసుకుంటామ ని కలెక్టర్ తెలిపారు. నిర్దేశిత గడువులోగా పను లు పూర్తయ్యేలా ఇంజనీర్లు చర్యలు తీసుకోవాలన్నారు. గడువులోగా పూర్తిచేయడమే కాకుం డా నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలన్నారు. పనులు పూర్తయ్యాక ఆ పనులకు సంబంధించి న శాఖకు ఆ భవనాన్ని అప్పగించాలని అన్నా రు. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం చేపడుతున్న పనులను ప్రతి నెల సమీక్షించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ జిన్నారం, జహీరాబాద్, పటాన్‌చెరు సంగారెడ్డి, కంగ్టి, మునిపల్లి, నారాయణ్‌ఖేడ్, మనూర్, నా గల్‌గిద్ద, పుల్కల్, ఆందోల్, రాయికోడ్, వట్‌ప ల్లి, సిర్గాపూర్ మండలాలకు సంబంధించిన పంచాయతీరాజ్ పనులను మండల వారిగా జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఖేడ్ మండలం ర్యాకల్ గ్రామంలో రూర్బన్ కింద చేపడుతున్న వివిధ పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. వివిధ ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న అంగన్‌వాడి భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేసి జిల్లా సంక్షేమాధికారికి అప్పగించాలన్నారు. పే ద ప్రజల ఆత్మగౌరవంతో బ్రతికేందుకు ప్రభు త్వం రెండు పడకల ఇళ్ల నిర్మాణం చేపట్టిందని, ప్రాధాన్యత ఆధారంగా పూర్తిచేయాలన్నారు. ఎక్కడైన రెండు పడుకల ఇళ్లకు సంబంధించి స్థ ల సేకరణలో ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే తగుచర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమీక్షలో పంచాయతీ రాజ్ అధికారి వెంకటేశ్వర్లు, ఈఈలు, దామోదర్, వేణుమాధవ్, జి ల్లా సంక్షేమాధికారి మోతీ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News