Wednesday, April 24, 2024

నిబంధనలకు విరుద్దంగా నగర రోడ్లపై పొరుగు జిల్లాల ఆటోలు

- Advertisement -
- Advertisement -

దాడులు సిద్దం అవుతున్న ఆర్టిఏ అధికారులు

Neighboring districts autos run on city roads

మనతెలంగాణ,సిటీబ్యూరో:  నిబంధనల పట్టించు కోకుండా ఇతర జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న ఆటోలను స్వాధీనం చేసుకునేందుకు రవాణా శాఖ అధికారులు సిద్దం అవుతున్నారు. ట్రాఫిక్ సమస్యలకు తోడు కాలుష్యానికి కారణం అవుతున్న వీటిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు. నగరంలో పది సంవత్సరాల క్రితం వరకు ఒక లక్ష వరకు ఆటోలు వుండేవి. వీటి సంఖ్య పెరిగే కొద్ది సమస్యలు ఉత్పన్న అవుతున్నాయి. ఈ అంశంపై దృష్టి పెట్టిన గత ప్రభుత్వం కూడా నగర రోడ్లపైకి ఆటోలు రాకుండా నిషేదం విదించింది.

ఇతర జిల్లాల నుంచి ఇక్కడకు ఆటోలు రాకుండా నిషేదాజ్ఞలు అమల్లోకి తెచ్చింది. కాని ఆటో వాల నుంచి గట్టి ఒత్తిడి రావడంతో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 20 వేల ఆటోలకు అనుమతులు ఇచ్చింది .ప్రస్తుతం నగరంలో 1 లక్ష 20 వేల ఆటోలు ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆటోల సంఖ్య పెరగడంతో కొన్ని ప్రాంతాల్లో భారీ స్థాయిలో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం అవుతోందని ట్రాఫిక్ అధికారులు సైతం గుర్తించారు.దీనిపై అంతర్గత సర్వే కూడా నిర్వహించారు.ప్రస్తుతం నగరంలో ఉన్న ఆటోలు మాత్రేమ కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా వేలాది ఆటోలను ఇక్కడకు తీసుకు వచ్చి తిప్పుతున్నారని సర్వేలో తేలింది.

పోరుగున ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలతో పాటు పూర్వపు, మహాబూబ్‌నగర్, ఉమ్మడి నల్గొండ,మెదక్ తదితర జిల్లాల నుంచి కూడా సుమారు 15 వేల నుంచి 25 వేల ఆటోలు నగరానికి చేరినట్లు తెలిసింది. ఈ విధంగా అక్రమంగా వచ్చిన ఆటోలకు మీటర్లు సైతం వుండటం లేదు. వేలాది ఆటోలు మీటర్లు లేకుండా నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్నాయని , రవాణా శాఖ ,పోలీసు అధికారులు గుర్తించారు.ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఆటో యజమాని ఒకరైతే దీన్ని నడుపుతున్న డ్రైవర్ మరొకరు వుంటున్నారు.

ఈ విధంగా ఆటోలు నడుపుతున్న వారికి డ్రైవింగ్ లైసెన్స్‌లు కూడా ఉండటం లేదు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఆటోల కారణంగా ట్రాఫిక్ సమస్య మాత్రమే కాకుండా, కాలుష్యం కూడా పెరిగిందని అధికారులు గుర్తించారు. నగరంలోకి వచ్చిన కొన్ని సెవన్ సీటర్ ఆటోలతో తరుచు ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ఆటోలను స్వాధీనం చేసుకోవాలని రవాణా,ట్రాఫిక్ పోలీసు అధికారులు నిర్ణయించారు. ఈ రెండు శాఖలు సమ్వనయంతో వారం రోజులు పాటు దాడులు చేయడానికి సిద్దం అవుతున్నారు.ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఆటోలను గుర్తించేందుకు ఇతర ఆటో సంఘాల నాయకులు కూడా అంగీకరించినట్లు వారు తెలిపారు. ఈ మేరకు రవాణా, ట్రాఫిక్ పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇతర జిల్లా నుంచి వచ్చిన ఆటోలు స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేకంగా కార్యారణ రూపొందించినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News