Friday, March 29, 2024

100 ఏళ్ల నాటి బ్యాక్‌డ్రాప్‌తో…

- Advertisement -
- Advertisement -

Nene Naa movie trailer released

 

రెజీనా కాసాండ్రా ప్రధాన పాత్రలో కార్తిక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం నేనేనా. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో అక్షర గౌడ, వెన్నెల కిషోర్, జేపి, తాగుబోతు రమేష్, జీవా రవి, మైకేల్, రాచపూడి కౌశిక్, యోగి, రవి రాజా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం నుండి ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా, ఉత్కంఠ భరితంగా కొనసాగింది. 100 ఏళ్లకి సంబంధించిన బ్యాక్‌డ్రాప్‌ను ఈ చిత్రంలో చూపించనున్నారు. మర్దర్లు, క్రైమ్, హార్రర్ జోనర్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని ఆపిల్ స్టూడియోస్ వారు నిర్మిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News