Home తాజా వార్తలు ఛీ ఛీ… రజాక్ అలాంటి వ్యక్తా?

ఛీ ఛీ… రజాక్ అలాంటి వ్యక్తా?

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ వివాదాస్పద ట్వీట్లు చేస్తూ నెటిజన్ల కోపానికి గురవుతున్నాడు. పాక్ టివి ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో రజాక్ చేసిన వ్యాఖ్యలపై మహిళ సంఘాలు మండిపడుతున్నాయి. తాను సంప్రదాయంగా వివాహం చేసుకున్నానని, కానీ ఒక సంవత్సరంలో ఆరుగురు అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు కొనసాగించానని చెప్పడంతో పాటు ఇందులో తప్పులేదని తనని తాను సమర్ధించుకున్నాడు. దీంతో  నెటిజన్లు రజాక్‌ను బండబూతులు తిడుతున్నారు. పాక్‌లో గొప్ప ఆటగాడివనే గౌరవం మీ మీదం ఉండేదని, ఇవాళ్టితో పోయిందన్నారు. రజాక్ అంటేనే నెటిజన్లు ఛీ చీ అంటున్నారు. గతంలో షమీ ముస్లిం కాబట్టే అద్భుత ప్రదర్శన చేస్తున్నాడని, హార్దిక్ పాండ్యాను తనకు 15 రోజులు అప్పగిస్తే ప్రపంచంలో అత్యుత్తమ ఆల్ రౌండర్‌ను తయారు చేస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

 

Netizens Serious on Pakistan All Rounder Rajak