Home జిల్లాలు కొత్త కలెక్టరేట్లలోపాలన కలెక్టర్

కొత్త కలెక్టరేట్లలోపాలన కలెక్టర్

new-collcterచివ్వెంల : విజయదశమి నుండి కొత్త జిల్లాలలో పరిపాలన ప్రారంభమవుతుందని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి చెప్పారు. గురువారం ఆయన సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌గా ఎంపిక చేసిన మండలంలోని కామాక్షి ఇంజనీరింగ్ కళాశాల భవనాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగం అందుబాటులో ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకే ప్రస్తుత నల్లగొండ జిల్లాను నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలుగా విభజించారని వివరించారు. సూర్యాపేట జిల్లా నాలుగు….. చదరపు కిలోమీటర్ల పరిధి కలిగి ఉందని తెలిపారు. సూర్యాపేట, కోదాడ రెవెన్యూ డివిజన్‌లు, 20 మండలాలతో జిల్లా ఏర్పాటు చేశారని వివరించారు. అన్ని శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండే విధంగా భవనాల ఎంపిక చేయడం జరిగిందన్నారు. 65వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన కామాక్షి ఇంజనీరింగ్ కళాశాల భవనం కలెక్టరేట్‌కు అన్ని విధాల సౌకర్యవంతంగా ఉందని చెప్పారు. గదులు కూడా విశాలంగా ఉన్నాయని, నిర్మాణం కూడా నాణ్యత కలిగివుందని సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే నెల ఏడవ తేదీలోగా సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు సంబంధించిన అన్ని ప్రభుత్వ శాఖల ఫైళ్లు నల్లగొండ నుండి కొత్త జిల్లా కలెక్టరేట్లకు చేరుకుంటాయని చెప్పారు. నల్లగొండ కలెక్టరేట్‌లో ఫైళ్ల విభజన, ఉద్యోగుల విభజన ప్రక్రియ వేగంగా సాగుతుందని వివరించారు. కొత్త జిల్లాలు పరిపాలన ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు కోటి రూపాయల నిధులు కేటాయించిందని తెలిపారు. ఆ నిధులతో చేపట్టాల్సిన పనులను ప్రభుత్వం దిశానిర్దేశం చేసిందని చెప్పారు. కొత్త కార్యాలయాలకు ఫర్నీచర్, కంప్యూటర్లు, వాహనాలు సమకూర్చే పని జరుగుతూనే ఉందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం చేపడుతున్నందున ఆ శాఖకు సంబంధించిన అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులను అధిక సంఖ్యలో పంపిస్తున్నట్లు తెలిపారు. కొత్త జిల్లాల వల్ల ప్రజలకు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సేవలు మరింత చేరువలోకి వస్తాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఆర్డీవో సి.నారాయణరెడ్డి, తహసీల్దార్లు మహమూద్ అలీ, రమాదేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అక్టోబర్ 1కి అప్పజెప్పాలి : కలెక్టర్
మనతెలంగాణ/భువనగిరి: కొత్త జిల్లాల ప్రక్రియలో భాగంగా కాబోయే భువనగిరి జిల్లా కేంద్రం పరిదీ పగిడిపల్లి గ్రామ శివారులో గల క్రిస్టియన్ సంస్థ భవనాల సముదాయాన్ని జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి గురువారం సందర్శించి పరిశీలించారు. ఏదైన పనులు అన్నిరకాల పనులు పూర్తి చేసుకొని అక్టోబర్ 1కి మాకు అప్పజెప్పాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లో అన్ని వసతులుండాలని, పనులు సక్రమంగా జరిగేలా చూడాలని స్థానిక ఆర్డీఓ ఎంవీ భూపాల్‌రెడ్డి చెప్పారు. పట్టణంలో హౌజింగ్‌బోర్డులో గల టిటిడి మండపాన్ని, సిసిబ్యాంకు భవనం, మున్నిపల కార్యాలయం, డ్వాక్రా బిల్డింగ్, ఎఫ్‌సిఐ గోదాములను కలెక్టర్ స్వయంగా అన్ని తిరిగి చూశారు. ఏశాఖకు , ఏభవనం కేటాయించాలన్న విషయం జెసి. సత్యనారాయణ, స్థానిక ఆర్డీఓ భూపాల్‌రెడ్డి, తహసిల్దార్ వెంకట్‌రెడ్డి, ఎన్‌జిఓస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మందడి ఉపేందర్‌రెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు.