Home తాజా వార్తలు మింక్ జంతువుల నుంచి ఆరు దేశాలకు కొత్త కరోనా వ్యాప్తి

మింక్ జంతువుల నుంచి ఆరు దేశాలకు కొత్త కరోనా వ్యాప్తి

New coronavirus spread from mink animals

 

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

జెనీవా : డెన్మార్క్, అమెరికా, ఇటలీ, నెదర్లాండ్స్, స్పెయిన్ , స్వీడన్ దేశాల్లో మింక్ అనే జంతువు పెంపుడు కేంద్రాల నుంచి కొత్తరకం కరోనా వైరస్ వ్యాపిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది. ఈ వైరస్ సోకిన వారిలో చికిత్సలో వస్తున్న ప్రాథమిక ఫలితాలను అంచనా వేస్తూ తదుపరి పరిశోధనలకు పిలుపునిచ్చింది. డెన్మార్క్ దేశానికి చెందిన ది స్టేటెన్స్ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఈవిషయమై అప్రమత్తం చేసింది. దీంతో ప్రభుత్వం ఉత్తర జూట్ ట్యాండ్ మున్సిపాలిటీల్లో కొత్త ఆంక్షలను విధించింది. ఈ ప్రాంతంలో వందల కొద్దీ ఫారమ్‌ల్లో మింక్‌ల పెంపకం చేపట్టారు. ఏడో తేదీ నుంచి ఆంక్షలు అమలు లోకి వస్తాయని ప్రధాని మెట్టీఫ్రెడెక్సన్ ప్రకటించారు.

దాదాపు 2,80,000 మందిపై ఈ ప్రభావం ఉంటుందని భయపడుతున్నారు. కొత్తగా అభివృద్ధి చేస్తున్న కొవిడ్ టీకాలకు ఈ వైరస్ ముప్పుగా మారవచ్చని ప్రభుత్వం హెచ్చరించింది. అక్కడ నివసించేవారు ప్రయాణాలు చేయవద్దని ప్రధాని హెచ్చరించారు. దాదాపు 1100 పెంపుడు కేంద్రాల్లో సుమారు 1.7 కోట్ల మింక్‌లు ప్రమాదంలో పడతాయని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఐదు పెంపుడు కేంద్రాల్లో 12 మందికి కొత్త కరోనా సోకింది. జూన్ నుంచి ఇప్పటివరకు 214 మందికి ఈ వైరస్ సోకినప్పటికీ నిర్లక్షం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. డెన్మార్క్ లో దాదాపు 17 మిలియన్‌ల మింక్‌లను వధించాలని ఆ దేశం ఆదేశించింది. డెన్మార్క్ నుంచి ప్రవేశాలపై బ్రిటన్ నిషేధం విధించింది.

New coronavirus spread from mink animals