Home ఎడిటోరియల్ కొత్త జిల్లాలు : పత్రికలకు కొత్త సవాళ్లు

కొత్త జిల్లాలు : పత్రికలకు కొత్త సవాళ్లు

Telugu-news-papers1

తెలంగాణలో 10 జిల్లాలకు బదులు 31 జిల్లాలు ఏర్పడటం పత్రిలకు కొత్త సవాళ్ల ను తెచ్చిపెట్టింది. వాటిని నియామకాలు, నిర్వ హణ, వార్తారచన అనే మూడు విధా లుగా వర్గీకరించవచ్చు. వీటిలో నియామకాలు పత్రికల యాజమాన్యాలకు, ఎడిటర్లకు కూడా సంబంధించిన విషయం. కొత్తగా జరిగే నియా మకాల కోసం తగిన అభ్యర్థులను వెతికే పని ఎడిటర్లది కాగా, వారికి వేతనాల కోసం అదనంగా ఖర్చుచేసే బరువు యాజమాన్యాలది అవుతుంది. నిర్వహణ బాధ్యత పూర్తిగా యాజమాన్యాలది. నిర్వహణ అంటే కొత్త ఎడిషన్లు, టాబ్లాయిడ్ల ముద్రణ ఖర్చు, సర్కులేషన్లకు, అడ్వర్టయిజ్‌మెంట్లకు అవసరమైన కొత్త ఏర్పాట్లు, సిబ్బంది నియా మకం, రవాణా, కమ్యూనికేషన్ ఏర్పాట్లు, అద్దె వసతులు, ఆఫీస్ ఖర్చుల వంటివి అనేకం ఉంటాయి. ఇటువంటివన్నీ పూర్తిగా యాజమాన్యాల బాధ్యత అవు తాయి. ఇక మిగిలింది వార్తా రచన. ఇది ఎడిటర్లు వారి సహచరులైన ఎడిటోరియల్, రిపోర్టింగ్ ఇబ్బంది తలకెత్తుకోవలసినది.
ఇవి ఏవీ కూడా తేలికైనవి కాదు. యథాతథంగానే ఒకటి రెండు మినహా తక్కిన పత్రికలు నష్టాలలో నడుస్తున్నాయి. ఆదాయం పెంచు కునేందుకు రకరకాల ప్రయత్నాలు చేసినా చాలటం లేదు. ఇంతకు ముందు అధికారపక్షాలనుంచి, అప్పటి ప్రభుత్వాల నుంచి అడ్డదారు లలో సంపాదించి పత్రికలు, ఛానళ్లపై ఖర్చు చేయటం కొంత ఉండేది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అటువంటి దారులు మూసుకు పోయాయి. సర్కులేషన్‌పై నష్టమే తప్ప లాభం ఉండదన్నది తెలిసిందే. ఒక పత్రిక కాపీ ధర కన్న దాని ముద్రణకు, ఇతర ఖర్చులకు అయ్యేది కనీసం రెట్టింపు వుంటుంది. అందువల్ల, ఎన్ని ప్రతులు అమ్మితే అంత నష్టం. ఆ నష్టాన్ని పూడ్చుకునేది అడ్వర్టయిజ్‌మెంట్లమీద కాగా, మార్కెట్లో దానిని పంచుకునే పత్రికలు, ఛానళ్లు పెరిగిపోయాయి. ఈ పరిస్థితి తెలంగాణ ఏర్పా టుకు ముందునుంచే ఉండగా, ఆ తర్వాత మరింత తీవ్ర మైంది. కేవలం రెవెన్యూ కోణం నుంచి చూసినట్లయితే నిజానికి మార్కెట్లో ఇన్ని పత్రికలు, ఛానళ్లకు అవకాశమే లేదు.
పత్రికలకు ఖర్చు తగ్గించుకునే వీలు కూడా లేకుండా ఉంది. కాగితం, ప్రింటింగు, కరెంటు, రవాణా వంటివి పెరగటమే తప్ప తగ్గేవి కాదు. సిబ్బంది జీతాలను పొదుపు చేసే ప్రయత్నం చేస్తే ప్రతిభ గల వారు ఇతర సంస్థలలోకి వెళ్లిపోతున్నారు. అనుభవంలేని వారితో పత్రిక ప్రమాణాలు పడిపోతున్నాయి. రెవెన్యూ పెంచు కునేందుకు కొందరు ప్రభుత్వానికి నిమిత్తం లేని బయటిరంగాల్లో చేయకూడని పనులు చేస్తున్నా, అవి ఒక పరిమితికి మించి ముందుకు సాగటం లేదు. ఇవన్నీ కలిసి ఇప్పటికే కొంతకాలంగా క్లిష్టస్థితిని సృష్టించగా, ఇపుడు కొత్త జిల్లాల వచ్చే అదనపు ఆర్థిక భారం మూలిగే నక్కపై తాటిపండు పడ టమే అవుతుంది. దానితో, ఇతరత్రా ఆర్థిక మద్దతులు గల పత్రికలు మినహా తక్కిన వాటికి ఇది నిర్వహణకు సంబంధించిన కొత్త సవాలు అవుతుంది.
నియామకాల విషయానికి వస్తే, అది యాజామాన్యాలు, ఎడిటర్ల ఇద్దరి బాధ్యత అనుకున్నాము. యాజమాన్యాలకు సంబం ధించి వేతనాల బరువని పైన చూసాము. కాని ఆచరణాత్మకంగా చూస్తే ఎడిటర్లకు అది ఇంకా పెద్ద సమస్య అవుతున్నది. తెలుగులో తగిన ప్రమాణాలు గల ఎడిటోరియల్, రిపోర్టింగ్ సిబ్బందికి తీవ్ర మైన కొరత సంవత్సరాలుగా ఉంది. అందుకు ఒకటి రెండని గాక అనేక కారణాలు ఉన్నాయి. స్కూలు-కాలేజీ చదువుల బలహీనత, కుటుంబంనుంచి సమాజం నుండి నేర్చుకునేది తగ్గటం, అధ్యయనపు అలవాట్లు లేక పోవటం, శిక్షణల కొరత, ఉద్యోగపు వత్తిళ్లు, సరైన వారికి తగిన ప్రోత్సాహం లభించకపోవటం వంటి పలు రకాల పరిస్థితులు ఇందుకు కారణం. వాటివల్ల ఎడిటర్లు సమ స్యలు ఎదుర్కొంటుండగా కొన్ని పత్రిలకు కొన్ని చోట్ల అసలు నామమాత్రంగానైనా అభ్యర్థులు దొర కడం లేదు. బాగా ఖర్చుచేస్తున్న పెద్ద పత్రికలు సైతం తగిన అభ్యర్థు లను నియమించుకునేందుకు లేదా శిక్షణ ఇచ్చి తయారు చేసు కునేందుకు శ్రమ పడవలసి వస్తున్నది. ఇటువంటి స్థితిలో అందరికీ కలిపి కొద్దివేల మంది కొత్తగా అవసర పరిస్థితి కొత్త జిల్లాలు, కొత్తమండలాల ఏర్పాటు తో అకస్మాత్తుగా వచ్చిపడింది.
జిల్లాల ఏర్పాటు జరగనుందనే సూచనలు నిర్థారణగా కనిపిం చినప్పటినుంచే పత్రికలు, ఛానళ్లలో నియామకాల గురించిన కలవర పాట్లు, హడావుడులు మొదలయ్యాయి. అప్పటికేగల సిబ్బం దిని ఎట్లా సర్దుబాటు చేయటం, తమ సిబ్బందిని ఇతరులు ఆక ర్షించకుండా చూసుకోవటం, లేదా ఇతరుల నుంచి ఆకర్షించ టం, కొత్త వారు బయట ఎవరైనా ఉన్నారేమో వెతకటం వంటివి ఆరం భించారు. 21కొత్త జిల్లాలు, 25 కొత్త రెవెన్యూ డివిజన్లు, 125 కొత్త మండలాలు, 21 కొత్త టాబ్లాయిడ్లు అంటే మామూలు కాదు. ఇవన్నీ బయటి ప్రజలు ఊహిం చటం కూడా తేలికకాదు. కొన్ని విష యాలలో కొన్ని చిట్కాలను ఉప యోగించినా సమస్యను ఎదుర్కొనేందుకు వారు పడుతున్న శ్రమ తక్కువ కాదు. వీటన్నింటిని కొంతైనా కొలిక్కి తెచ్చేందుకు కొన్ని నెలల సమయం తీసు కునే అవ కాశం ఉంది. అప్పటికీ బరువు బాధ్యతలలో పెరుగుదల మాత్రం అదే విధంగా ఉంటుంది. ఆ విధంగా రానున్న కాలం తెలంగాణ మీడియాకు, ముఖ్యంగా పత్రికలకు, పరీక్షా సమయం వంటిది.
ఇక చివరి అంశం వార్తా రచన. మొదట అనుకున్నట్లు పత్రికల నిర్వహణలు, నియామకాలు యాజమాన్యాలకు, ఎడిటర్లకు సంబం ధించిన సమస్యలు. వాటితో పాఠకులకు నిమిత్తం లేదు. అవి వారికి తెలిసేవి కూడా కాదు. తమకు సంబంధించినది పత్రికలో తాము చదివే వార్తలు, కథనాలు, చూసే ఫోటోలు ఏ విధంగా ఉన్నాయ న్నది మాత్రమే. కనుక వృత్తిపరంగా చూసినపుడు పత్రికలకు ఎదురు కానున్న, లేదా ఇప్పటికే ఎదురవుతున్న అతిపెద్ద సమస్య ఇదేననాలి. ముక్కు సూటిగా చెప్పాలంటే ఇంతకుముందు గల 10 జిల్లాల టాబ్లాయిడ్లలో కనీసం కొన్నింటిని “సరైన” వార్తలు, “కథనాలతో” నింపేందుకు సమస్యగా ఉండగా, ఇపుడు 31 జిల్లాల టాబ్లాయిడ్ల విషయం ఏ విధంగా ఉండగలదో ఊహించవచ్చు. నిజానికి ఇంతకాలం కూడా, మరీ ముఖ్యంగా జిల్లా టాబ్లాయిడ్ల లోనూ మండలాల వారీ పేజీలు మొదలుపెట్టిన తర్వాత, “వార్త” అనేందుకు అర్హతలేని విషయాలు పేజీలలో కన్పించటం మొదలైంది. కథనాల పేరిట అసంబద్ధ అంశాలు, ప్రచారాలు, ఉద్దేశ పూర్వకమైన కల్పనలు రావటం ఎక్కువైంది. స్థానిక విలేఖరుల మధ్య, పత్రికల మధ్య ఉండే పోటీలు ఇందుకు దోహదం చేసాయి. అట్లా టాబ్లాయిడ్లు, జోనల్ పేజీలు కలిసి మరింత వివరమైన స్థానిక సమాచారాన్ని పాఠకులకు అందించే పాజిటివ్ పాత్రను, పైన చెప్పిన అసంబద్ధ రాతలకు పాల్పడే నెగెటివ్ పాత్రను కూడా ఏక కాలంలో పోషించటం తెలిసిన విషయమే. ఇపుడు జిల్లాలు, మండ లాలు, జోన్లు, పేజీల పెరుగుదల వల్ల కలిగే ఒత్తిడితో ఈ నెగెటివ్ పాత్ర ఎక్కువయ్యే ప్రమాదం ఉందా అన్నది ప్రశ్న. పరిస్థితు లను గమనించి నపుడు, అట్లా జరిగే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి.
ఇది తప్పక ఆందోళనను కలిగించే విషయం అయినందున, దీనిని ఎట్లా ఎదుర్కోవటం అన్నది ప్రశ్న. అందుకు కన్పిస్తున్న ఒకే ఒక మార్గం, ఎక్కడికక్కడ విలేఖరులు నిజమైన పరిశీలనలతో క్షేత్రస్థాయి కథనాలను రాయటం. విషయాలు అనేకం, వాటికి కోణాలు అనేకం ఎప్పుడూ ఉంటాయి. వాటిని తగు విధంగా పరి శీలించే దృక్కోణాన్ని, వృత్తినైపుణ్యాన్ని వారికి కలిగించట మన్నదే చేయవలసిన పని. అందుకు పూనుకోవాలి గాని అసాధ్య మైనదేమీ కాదు. అంతకన్న మార్గాంతరం లేదు కూడా. వృత్తిపరంగా చూసినా, పత్రికలు తమ అస్తి త్వాన్ని కాపాడుకోవాలనుకున్నా, జర్నలిజం నాలుగు కాలాల పాటు విలు వలతో, విశ్వసనీయ తతో మనుగడ సాగించాలన్నా ఈ పని జర గాలి. అది జరిగే క్రమంలోనే వార్తల ప్రమాణాలు కూడా పెరుగుతా యి. ఇది ఎడిటర్లు, ఎడిటోరియల్, రిపోర్టింగ్ సిబ్బంది కలిసి పూను కోవలసిన యజ్ఞం.

టంకశాల అశోక్

9848191767