Home జాతీయ వార్తలు కొవిన్‌లో కొత్త ఫీచర్.. పుట్టిన తేదీతో సర్టిఫికెట్లు

కొవిన్‌లో కొత్త ఫీచర్.. పుట్టిన తేదీతో సర్టిఫికెట్లు

New feature in Kovin‌, Certificates with date of birth

 

న్యూఢిల్లీ : వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల విషయంలో భారత్, బ్రిటన్ మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో విదేశాలకు వెళ్లనున్న భారతీయుల కోసం కొవిన్‌లో కొత్త ఫీచర్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఈమేరకు పూర్తి పుట్టిన తేదీని పొందుపర్చిన కొవిన్ సర్టిఫికెట్లు జారీ చేయనున్నట్టు అధికార వర్గాల సమాచారం. ప్రస్తుతం సర్టిఫికెట్‌లో వ్యక్తి వయసు మాత్రమే నమోదవుతుండగా, ఇప్పుడు డబ్ల్యుహెచ్‌వొ నిబంధనలకు అనుగుణంగా పుట్టిన తేదీతో కూడిన సర్టిఫికెట్ ఇస్తారు. వచ్చే వారం నుంచి ఇది అందుబాటు లోకి వచ్చే అవకాశం ఉంది.