Home Default నూతన అటవీ చట్టం రెడీ

నూతన అటవీ చట్టం రెడీ

forest Rights act

మన తెలంగాణ / హైదరాబాద్ : అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం తెలంగాణలో నూతన చట్టం అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి అటవీ శాఖ ప్రతిపాదనలను సైతం పూర్తి చేసింది. ఈ ప్రతిపాదనలకు పాలన పరంగా అన్ని రకాల ఇబ్బందులు తొలగడంతో దేశానికే ఆదర్శంగా చట్టం ఉంటుందనే అభిప్రాయాలను అటవీశాఖ అధికార యంత్రాంగం అభిప్రాయపడుతుంది. దీంతో త్వరలోనే చట్టం అమలు చేసేందుకు ప్రభుత్వం అవసరమైన కసరత్తు చేస్తుంది. బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని భావించినా అందుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో ప్రస్తు తం ఆర్డినెన్స్‌ను ద్వారా చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని సర్కార్ తీర్మానించినట్లు తెలుస్తోంది.
ఇదీ నేపథ్యం
1967న రూపొందించిన ఇండియన్ ఫారెస్టు చట్టానే నేటికి అమలు చేస్తున్నారు. ప్రస్తుతం అనుసరిస్తున్న చట్టం మారిన పరిస్థితులకు అనుగుణంగా లేకపోవడం తో పాటు చట్టం తీవ్రతరం లేకపోవడంతో వ్యవస్థికృత నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. దీంతో పాటు కర్రకు పెద్దగా విలువ లేకపోవడం, అడవులను నాశనం ధ్వంసం చేసి వ్యాపారం చేయాలనుకునే వారు చాలా స్వల్పంగా ఉండడం, అటవీ చట్టాల్లో పెద్దగా తీవ్రత లేకపోవడం, వెంటనే బెయిల్ లభించడం, జరిమానాలు నామమాత్రంగా ఉండడంతో పాటు చిన్నపాటి శిక్షలు, నామమాత్రపు జరిమానాలతో సరిపెట్టేలా ఉండడంతో నేరస్తులు ఈ చట్టాలను పరిగణలోకి తీసుకునే అవకాశముండేది కాదు. ఈ నేపథ్యంలో అటవీ చట్టాల తీవ్రతను పెంచడంతో పాటు భారీ శిక్షలు, జరిమానాలతో పాటు చట్టాలకు పదునుపెట్టేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని సిఎం కెసిఆర్ అటవీ శాఖను ఆదేశించారు. ఆ దిశగా సంబంధితశాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా అడవి నుంచి పూచికపుల్ల కూడా బయటకు వెళ్లకుండా ఉండడంతో పాటు వ్యవస్థికృత నేరగాళ్లను ఆటకట్టించేలా ఉండేందుకు చట్టాన్ని కఠినంగా రూపొందించాలని సూచించారు. తెలంగాణ అటవీచట్టం దేశానికే రోల్ మోడల్‌గా ఉండేలా ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు. కీలక మార్పులతో నూతన చట్టానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసిన అటవీశాఖ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం వేచిచూస్తుంది.
అడవులకు అత్యధిక ప్రాధాన్యత
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అటవీశాఖకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. ప్రధానంగా అడవుల శాతాన్ని పెంచడంతో పాటు వాతావరణ సమతుల్యం చేయడం, భవిష్యత్ తరాల జీవన ప్రమాణాల పెరుగుదలకు భారీ ఎత్తున ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగానే “తెలంగాణకు హరితహారం” రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. హరితహారం పథకంలో భాగంగా ప్రతి ఏడాది 40 కోట్ల మొక్కలు నాటేలా ప్రణాళికలను సిద్ధం అమలు చేసింది. ఈ ఏడాది నుంచి మొక్కల సంఖ్యను వంద కోట్లకు పెంచిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో కోతుల బెడద విపరీతంగా ఉండడంతో చేతికొచ్చిన పంట నాశనమవుతుండడంతో రైతులు తీవ్ర మనోవేధనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కోతులు తిరిగి అడవులకు వెళ్ళాలని, వానలు వాపస్ రావాలని ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. అడవుల పెంపకంతో పాటు అరుదైన జంతువుల సంరక్షణకు కూడా ప్రభుత్వం పెద్దపీట వేసి అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది. గతం లో జంతువులను ఈజీగా చంపే నేరగాళ్లను గుర్తించేందు కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో పాటు అడవి నుంచి జంతువులు బయటకు రాకుండా ఉండడంతో పాటు వాటిని వేటాడకుండా ఉండే చర్యలకు సైతం ప్రభుత్వం ఉపక్రమించింది. ఇందుకోసం వన్యప్రాణులకు అవసరమైన ఆహా రం లభించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది.
నూతన చట్టంలో ప్రతిపాదనలివి
అటవీశాఖ రూపొందించిన కొత్త చట్టంలో అడవుల్లో చెట్ల నరికివేతతో పాటు పులులు, ఇతర జంతువుల వేటకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రతిపాదనలను సిద్ధం చేసింది. అడవుల ఆక్రమణలు, అక్రమ కలప రవాణా, అరుదైన వన్యప్రానుల వేటకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించే ప్రతిపాదనలను కూడా అటవీశాఖ అధికారులు పొందుపర్చినట్లు సమాచారం. చట్టాన్ని మరింత కఠినతరం చేయడం, గణనీయంగా జైలు శిక్ష లు, జరిమానాలు పెంచడంతో పాటు నేరాలకు పాల్పడే వారిలో భయం కలిగే లా నూతన చట్టంలో మార్పులు చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకున్న చట్టాల మేరకు ఈ తరహా నేరాలకు ప్రేరేపించే వారితో పాటు ప్రోత్సాహించే వారు, డబ్బు సమకూర్చే వారి జోలికి వెళ్లకపోవడంతో నూతన చట్టంలో వీరి భరతం కూడా పట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికనుగుణంగానే నూతన చట్టాన్ని ప్రతిపాదనలను పొందుపర్చినట్లు సమాచారం. అడవుల్లో చెట్ల నరికివేత, జంతువుల వేట, అటవీ భూ ఆక్రమణలు, వంటి ఇతర నేరాలకు పాల్పడిన వారిపై కనీసం మూడేళ్ల వరకు జైలు శిక్ష, 5 లక్షల వరకు జరిమానా విధించేలా అటవీశాఖ ప్రతిపాదనలను రూపొందించింది. ందులో కొంత మార్పుచేర్పులతో చట్టానికి తుదిరూపు ఇవ్వాలని సిఎం కెసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు ఎర్ర చందనం, చందనం చెట్లు ఈ జాబితాలో ఉండగా కొత్తగా టేత్తగా, నల్లమద్ది, బీజాసాల్, నారేటి తదితర రకాలను కూడా ఈ జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది.
ఆధునిక పరిజ్ఞానంతో వేటగాళ్ల అన్వేషణ
పదే పదే అటవీ నేరాలకు పాల్పడే వారి పట్ల మరింత కఠినంగా వ్యవహరించడంతో పాటు పులులు, అభయారణ్యాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా వాటి జాడను, వేటగాళ్ల కదలికలను పసిగట్టాలని భావిస్తోంది. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం అందుబాటులోకి తీసుకువచ్చింది. పులులు, ఇతర జంతువులు అక్రమ కరెంటు తీగల బారిన పడి మరణించకుండా ఇన్సులేటేడ్ వైరింగ్, మెటల్ డిటెక్టర్ల వినియోగం, ఇతర చర్యలు చేపట్టాలని కూడా అటవీశాఖ నిర్ణయించింది.

New forest Rights act in telangana