Home జాతీయ వార్తలు చింతపండుపై జిఎస్‌టి సున్నా

చింతపండుపై జిఎస్‌టి సున్నా

 GST Council Meeting

 

వెట్‌గ్రైండర్‌లపై ఇక 5 శాతం
హోటల్ గదులపై రేట్ల తగ్గింపు
మండలి భేటీలో కీలక నిర్ణయాలు
వెల్లడించిన ఆర్థిక మంత్రి
కెఫినెటెడ్ బెవరెజెస్‌పై వడ్డింపు
వీటిపై సుంకంతో కలిస్తే 40 శాతం
1వ తేదీ నుంచి అమలు
పన్నుల సరళీకృతంపై మరింత ఆలోచన

పనాజీ : చింతపండుపై జిఎస్టీ పూర్తిగా ఎత్తివేశారు. ప్రజలకు నిత్యావసరం అయిన చింతపండుపై ఇప్పుడు 5 శాతం జిఎస్టీ ఉంది. వివిధ వస్తువుల పన్ను రేట్లపై గోవాలో శుక్రవారం అత్యున్నత స్థాయి జిఎస్‌టి మండలి కీలక సమావేశం జరిగింది. మండలి భేటీ తరువాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విలేకరులతో మాట్లాడారు. పన్నుల సరళీకృతం గురించి విస్తృత స్థాయిలో సమీక్ష జరిగిందని ఆమె తెలిపారు. జిఎస్టీ మార్పులన్నీ కూడా అక్టోబర్ 1 నుంచి అమలోకి వస్తాయని మంత్రి వివరించారు. మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. పన్ను రేట్ల సరళీకరణపై వివిధ వర్గాల నుంచి సూచనలు స్వీకరించినట్లు తెలిపారు. కేఫినెటెడ్ బేవరేజెస్‌పై జిఎప్‌సిని 18శాతం నుంచి 28 శాతానికి పెంచినట్లు దీనికి అదనంగా 12 శాతం సుంకం కలిపితే మోత్తం మీద వీటిపై పన్ను 40 శాతానికి చేరుతుందని వివరించారు. ఇక హౌటల్ రూంల టారీఫ్‌పై జిఎస్‌టిని కుదిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ వివరాలు ఈ విధం గా ఉన్నాయని ఒక్క రాత్రికి రూ 1000 వరకూ ఉండే హోటల్ రూంల అద్దెలపై జిఎస్టీ ఉండదు. ఇక రూ 1001 నుంచి రూ 7800 వరకూ నైట్ రూం టారీఫ్ ఉండే వాటికి 12 శాతం జిఎస్టీ విధిస్తారు. ఇప్పటివరకూ ఇది 18 శాతంగా ఉంటూ వచ్చిందని మంత్రి తెలిపారు. ఇక రూ 7500కు పైబడ్డ టారీఫ్ ఉన్న హోటల్ రూంలపై ఇప్పటివరకూ 28 శాతం జిఎస్టీ ఉండగా దీనిని ఇప్పుడు 18 శాతం చేశారు. ఇక ఔట్‌డోర్ కేటరింగ్‌లపై జిఎస్టీని ఇంతకు ముందటి వరకూ 18 శాతం వరకూ ఉండగా దీనిని ఇప్పుడు 5 శాతానికి ఖరారు చేశారు. మెరైన్ ఫ్యూయల్‌పై జిఎస్‌టిని 5 శాతం చేశారు. నిర్ణీత రక్షణ సరుకుల దిగుమతులపై జిఎస్టీని మినహాయించారు. భారతదేశంలో తయారు కాకుండా ఉండి ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే సరుకులకు ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ రాయితీ రక్షణ రంగ ఉత్పత్తులపై 2024 వరకూ అమలులో ఉంటుంది.

1. ఇక అల్లిన/అల్లకుండా ఉండే పాలిథిన్ బ్యాగులపై సార్వత్రిక జిఎస్టీ రేటు 12 శాతంగా ఉంటుంది.
2. వెట్ గ్రైండర్స్‌పై ఇప్పుడున్న 12 శాతం జిఎస్టీని 5 శాతానికి తగ్గించారు.
3. పిఫాకు అందించే వస్తువులు సేవలపై భారత్‌లో జరిగే పిఫా అండర్ 17 మహిళల టోర్నీ వరకూ జిఎస్టీ మినహాయింపులు కల్పిస్తారు.
4. 10 నుంచి 13 మందిని తీసుకువెళ్లే సామర్థం ఉన్న పెట్రోలు వాహనాలపై గరిష్టంగా ఉన్న 28 శాతం జిఎస్టీపై సుంకాన్ని 1 శాతం తగ్గించారు. ఇక ఇదే వాహక సామర్థపు డీజిల్ వాహనాలపై 3శాతం తగ్గించారు.
5. బాదం పాలపై జిఎస్టీని 18 శాతంగా ఖరారు చేశారు. ఇక జిప్స్‌పై జిఎస్టీని ఇంతకు ముందు 18 శాతంగా ఉండగా దీనిని ఇప్పుడు 12 శాతంగా కుదించారు.
6. డైమండ్ జాబ్ వర్క్‌పై జిఎస్టీని ఇంతకు ముందు 5 శాతం ఉండగా దీనిని ఇప్పుడు 1.5 శాతం చేశారు.
7. మెషిన్ జాబ్ కట్ సరఫరాలపై ఇంతకు ముందు 18 శాతంగా ఉండగా, 12శాతంగా ఖరారు చేశారు.

New GST changes to effect out on October 1