Home సంగారెడ్డి పంచాయతీలపై కొత్త ఆశలు

పంచాయతీలపై కొత్త ఆశలు

sch

*అసెంబ్లీలో బిల్లుతో మార్పులు
*జిల్లాలో 157 కొత్త పంచాయతీలకు అవకాశం
*కౌడిపల్లిలో అత్యధికం (20), అల్లాదుర్గంలో అత్యల్పం (3)
*పెరుగనున్న కోఆప్షన్ సభ్యులు

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త పంచాయతీల ఏర్పాటు కొలిక్కి వచ్చింది. నూతన పంచాయతీరాజ్ బిల్లు శాసనసభలో బుధవారం మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లాలో నూతన పంచాయతీ చట్టం అమలైన తరువాత ఉండే 312 పంచాయతీలకు అదనంగా మరో 157 పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. గతంలో జిల్లాలో మొత్తం 320 గ్రామ పంచాయతీలుండేవి. నగర పంచాయతీలలో మరో 8 పంచాయతీలను విలీనం చేయనున్నారు. దాంతో ఆ సంఖ్య 312కి పడిపోనుంది. ఈ నూతన ఉత్తర్వుల వల్ల ప్రజలకు పల్లెపాలన మరింత చేరువ కానుంది. ప్రభుత్వం వేగంగా అడుగులు వేయడం చూస్తుంటే కొత్త పంచాయతీల ప్రకారమే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పల్లె పాలన మరింత చేరువకానుంది. తె లంగాణ ప్రభుత్వం తొలుత గిరిజన, గూడెంలు, తండాలను గ్రామపంచాయతీలుగా చేస్తామని ప్రకటించినా ఆ త ర్వాత గిరిజనేతర ప్రాంతాల్లోను డిమాం డ్ ఉన్న చోట కొత్త పంచాయతీల ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది. ఇప్పటికే కొత్త గ్రామాల ప్రతిపాదనల్లో మార్పులు, చే ర్పులు చాలా సార్లు జరిగాయి. ఉమ్మడి జిల్లాలో గిరిజన గ్రామాలు పంచాయతీలపై కొత్త ఆశలు ప్రధానంగా నర్సాపూర్, నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాలోనే నమోదయ్యాయి.ఇక్కడ కొత్త పంచాయతీల సంఖ్య భారీగా పెరిగింది. గ్రామ కార్యాలయాలు అందుబాటులోఉండడం వలన సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం ఏర్పడనుంది. దీంతో పాటు సర్పంచుల సంఖ్య పెరగనుండడంతో చాలా మందికి రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం ఏర్పడనుంది. మెదక్ జిల్లాలోని 15 మండలాల్లో నూతన పంచాయతీలు ఏర్పడనున్నా యి. అత్యధికంగా శివ్వంపేట మండలంలో 15 నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. అత్యల్పంగా అల్లాదుర్గంలో 3 నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి.

బుధవారం శాసనసభలో ప్రవేశ పెట్టిన బిల్లు ప్రకా రం సర్పంచ్ పదవులకు ప్రత్యషంగానే ఎన్నికలు నిర్వహించనున్నారు. గతంలో ఉన్న పాత విధానమే కొనసాగనుంది. అయితే ఈ సారి తాజగా ఉపసర్పంచ్ పదవులకు డిమాండ్ ఏర్పడనుంది. సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు సైతం ఉమ్మడి చెక్ పవర్ ఇవ్వనుండడంతో ఈ పదవికి పోటీ ఏర్పడే పరిస్థితి నెలకొంది. నిధుల వ్యయంలో పారదర్శకత కోసమని సర్పంచ్,ఉప సర్పంచ్ లకు కలిపి చెక్ పవర్ ఇవ్వనున్నారు. ఇంతకుముందు గ్రామ సర్పంచి తో పాటు గ్రామ కార్యదర్శి, లేక ఈఓపిఆర్‌డి లకు కలిపి చెక్ పవర్ ఉండేది.ఈ పద్దతికి స్వస్థి పలుకనున్నారు. ఒకసారి ఖరారైన రిజర్వేషన్ ఇకపై పదేళ్ల పాటు అమలులో ఉండేలా నూతన చట్టం లో పొందుపరిచారు. అంతే కాకుండా సర్పంచ్‌ను సస్పెండ్ చేస్తే ఇంతకు ముందు పంచాయతీ రాజ్ శాఖ మంత్రికి ఆప్పీల్ చేసే విధానం అమలులో ఉండేది. ఇప్పుడు ఈ విధానానికి స్వస్థి పలికి అవినీతికి పాల్పడే సర్పంచ్‌లను తొలగించే అధికారం కలెక్టర్‌లకు ఆప్పగించారు. వీరు అప్పీలు చేసుకునేందుకు ఒక ప్రత్యేక అప్పీలేట్ ఆథారీటిని (ట్రిబ్యునల్) నియమించనున్నారు. ఇప్పటిలా కాకుండా ఇకపై ప్రతి రెండు నెలలకోసారి తప్పనిసరి గ్రామ సభ నిర్వహించాల్సి ఉంటుంది. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల మాదిరిగానే కో ఆప్షన్ సభ్యుల ఎంపిక ఈ సారి గ్రామ పంచాయతీల్లో సైతం వర్తింప జేయనున్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ముగ్గురు కోఆప్షన్ సభ్యులను నియమించనున్నారు. పంచాయతీలోని వయో వృద్దులు (సీనియర్ సిటిజన్స్) నుంచి ఒకరిని సభ్యులుగా ఎన్నుకుంటారు. సమాజం పట్ల అవగాహన ఉన్న వారిని ఈ కోటాలో ఎంపిక చేస్తారు. గ్రామాల్లో పటిష్టంగా ఉంటూ సంఘటిత శక్తిగా కొనసాగుతున్న స్వయం సహాయక సంఘాలకు భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో గ్రామ సమాఖ్య (విఓ) ఆధ్యషురాలిని, మరో కో ఆప్షన్ సభ్యురాలిగా తీసుకుంటారు. గ్రామ అభివృద్ధి కోసం ముందుకోచ్చిన దాతలు, నిధులిచ్చిన వారిని కొ ఆప్షన్ సభ్యుని కింద ఎంపిక చేస్తారు. ప్ర తి పంచాయతీకి ముగ్గురు చోప్పున మొత్తం 469 పంచాయతీలకు లెక్కిస్తే మొత్తం 1407 మందికి కొ ఆప్షన్ సభ్యులుగా అవకాశం లభించనుంది.
పంచాయతీలకు ప్రత్యేక నిధులు : ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలకు కేం ద్రం నుంచే నిధులు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మండలాలు, జిల్లా పరిషత్‌లకు వచ్చే ఆర్థిక సంఘం నిధులు సైతం పంచాయతీలకు మ ళ్లించింది. పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు వస్తుండగా ఆదనంగా నిధులు రావడంతో చాలా చోట్ల పంచాయతీల్లో సమస్యలు పరిష్కారమవుతున్నాయి. దీం తో పాటు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ప్రత్యేకంగా రూ.1200కోట్ల బడ్జెట్‌లో కేటాయించారు. దీంతో పంచాయతీల్లో మరిన్ని పనులు చేపట్టే అస్కారముంది.
నగర పంచాయతీలుగా మరో మూడు ఎంపిక : నగర పంచాయతీలుగా మెదక్ జిల్లాలో రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ లను ఎంపిక చేశారు. ఇక పై ఈ మేజర్ గ్రామ పంచాయతీలు నగర పంచాయతీలుగా అవతరించనున్నాయి. నర్సాపూర్‌లో నర్సాపూర్, హన్మంతపూర్, మల్‌పర్తిలను విలీనం చేశారు. తూప్రాన్ నగర పంచాయతీలో అల్లాపూర్, బ్రాహ్మాణ పల్లి, రావెల్లి, గ్రామాలను విలీనం చేశారు. మెదక్ మున్సిపాలిటిలో పిల్లికోటాల్, ఆవుసుల పల్లి, ఔరంగాబాద్ గ్రామాలను విలీనం చేశారు.
పెద్దశంకరంపేటలో 5 నూతన గ్రామపంచాయతీలు : పెద్దశంకరంపేట మండలంలో నూతనంగా 5 గ్రామ పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటి వరకు మండలంలో 22 గ్రామ పంచాయతీలుండగా తాజా ఉత్తర్వులతో ఆ సంఖ్య 27 కు చేరనుంది. మండల పరిదిలోని సంగారెడి పేట, దానంపల్లి, గొపని వెంకటాపూర్, ఇసుకపాయల తండా, జంలా నాయక్ తండాలు నూతన పంచాయతీలుగా అవతరించనున్నాయి.
ఈ పంచాయతీలలో కొత్త పంచాయతీ భవనాలు నిర్మించేంత వరకు చావిడి, పాఠశాల భవనాలలోని కొంత భాగం పంచాయతీ కార్యాలయం కోసం వినియోగించుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.