Home తాజా వార్తలు చంద్రుడిపై భారీ బిలాలు..

చంద్రుడిపై భారీ బిలాలు..

Moon

హైదరాబాద్: మరోకొన్ని రోజుల్లో చంద్రుడి దక్షిణ దృవంపై చంద్రయాన్-2ల్యాండ్ కానుంది. చంద్రయాన్‌-2 వ్యోమనౌకలోని టెర్రైన్‌ మ్యాపింగ్‌ కెమెరా-2  తీసిన చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. ఈ కెమెరా చంద్రుడికి 4,375 కిలోమీటర్ల ఎత్తు నుంచి క్రేటర్‌ జాక్సన్‌, మిత్ర, మ్యాక్‌, కొరలెవ్‌ల చిత్రాలను తీసి పంపింది. జాక్సన్ లోయ చంద్రుడి ఉత్తర ద్రువం వైపున ఉండగా, సుమారు 71.3 కిలోమీటర్ల వెడల్పుతో ఉన్నట్లు తెలిపింది. ఇక మిత్రా క్రేటర్ సుమారు 92 కిలోమీటర్ల వెడల్పుతో ఉన్నట్టు ఇస్రో తెలిపింది. చంద్రయాన్2 సెప్టెంబర్ 7న చంద్రుడిపై ల్యాండ్ కానుంది.

new images of craters on Moon taken by Chandrayaan 2