Thursday, April 18, 2024

అత్యాచారం కేసులో వెలుగులోకి కొత్త విషయాలు

- Advertisement -
- Advertisement -

Rape Case

 

హైదరాబాద్ : మోడల్‌పై అత్యాచారం కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనకు మద్యం తాగించి ఇద్దరు యువకులు అత్యాచారం చేశారని మోడల్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్తు చేస్తుంటే కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యువతి కావాలనే ఆరోపణలు చేస్తున్నదని తెలుస్తోంది. మరోవైపు డబ్బుల కోసమే అత్యాచారం ఆరోపణలు చేస్తోందని బాలుడు తల్లి ఆరోపిస్తోంది.

తన కుమారుడిని ప్లాన్ ప్రకారం ముగ్గులోకి దింపిందని, ఇద్దరు కలిసి టిక్‌టాక్ చేశారని తెలిపింది. మద్యం తాగి హాస్టల్‌కు వస్తుండడంతో బయటికి పంపించామని దానిని మనసులో పెట్టుకుని ఆరోపణలు చేస్తోందని తెలిపారు. తమను రూ.20లక్షలు డిమాండ్ చేసిందని వాటిని ఇచ్చేందుకు నిరాకరించడంతో కేసు పెట్టిందని తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో రాజీకుదరకపోవడంతో కేసు పెట్టిందని ఆరోపించింది. మోడల్ చెప్పినదాంట్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.

వివిధ కోణాల్లో దర్యాప్తు : పోలీసులు
మోడల్‌పై అత్యాచారం ఆరోపణలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. అత్యాచారం జరిగిందాలేదా తెలుసుకునేందుకు యువతిని వైద్య పరీక్షల కోసం పంపించనున్నట్లు తెలిపారు. యువతని భరోసా సెంటర్‌కు తరలించామని, వైద్య పరీక్షల అనంతరం అన్ని విషయాలు బయటపడతాయని తెలిపారు. నిందితులు మైనర్ల, మేజర్ల అనే విషయం కూడా తేల్చనున్నట్లు పేర్కొన్నారు.

New Issues in the Rape Case
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News