Home తాజా వార్తలు పంచాయతీ రిజర్వేషన్లు 50%

పంచాయతీ రిజర్వేషన్లు 50%

New panchayat

 

సుప్రీం కోర్టు హద్దుకు లోబడి నిర్ణయం
పంచాయతీరాజ్ చట్టానికి సవరణ

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వార్షిక బడ్జెట్ సమావేశాల సందర్భంగా మార్చి నెల చివర్లో తీసుకొచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేసేలా ఆదివారం ఒక ఆర్డినెన్సును తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా గ్రామ పం చాయతీలు, జిల్లా, మండల పరిషత్‌లలో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ప్రభుత్వం ఆ ఆర్డినెన్సులో స్పష్టత ఇచ్చింది. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం జనా భా దామాషా ప్రకారం ఎస్‌సి, ఎస్‌టిలకు రిజర్వేషన్లను ఖరారు చేసి వెనకబడిన వర్గాల (బి.సి.)లకు 34% రిజర్వేషన్‌ను నిర్ణయించింది. ఆ విధంగా మొత్తం రిజర్వేషన్లు దా దాపు 60% దాటే అవకాశం ఉంది. కానీ సుప్రీంకోర్టు మాత్రం 50 శాతానికి మించవద్దని స్పష్టం చేసినందున దానికి అనుగుణంగా ఆర్డినెన్సులో ఆ అంశాన్ని పేర్కొనింది.

ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరగడం లేదుకాబట్టి ఆర్డినెన్సును తీసుకురావాల్సి వచ్చిందని ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌లో పేర్కొనింది. అయితే కొత్త పంచాయతీరాజ్ చట్టంలో పేర్కొన్న రిజర్వేషన్లలో పది శాతం తగ్గించాల్సి ఉన్నందున ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు ఏ నిష్పత్తిలో రిజర్వేషన్లు ఉంటాయనేదానిపై త్వరలో స్పష్టత రానుంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం జనవరి 10వ తేదీలోగా రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణను పూర్తి చేయాల్సి ఉంది. ఒకవైపు పాతిక రోజుల్లోనే ఎన్నికలను పూర్తి చేయాల్సి రావడం, రిజర్వేషన్లు యాభై శాతం దాటకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. అందుకోసమే పంచాయతీ ఎన్నికలు, రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి మూడు రోజులుగా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షజరుపుతూ ఉన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం ఒకవైపు, రిజర్వేషన్లు యాభై శాతం దాటవద్దని సుప్రీంకోర్టు గత తీర్పు ఒకవైపు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది.

కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 60.19 శాతం ఉంటున్నందున దాన్ని 50 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్డినెన్సులో ప్రభుత్వం పేర్కొనింది. ఈ ఆర్డినెన్స్‌తో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. సమైక్య రాష్ట్రంలో 2013లో పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు రిజర్వేషన్లను యాభై శాతం కంటే ఎక్కువే ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆ ఒక్కసారికి మాత్రం అనుమతి తెచ్చుకుంది. ఈసారి కూడా ఇదే పరిస్థితి తలెత్తడంతో హైకోర్టుకు వెళ్ళి ప్రత్యేకంగా అనుమతి కోరడమా లేక సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం యాభై శాతం అమలుచేయడమా అని ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, పంచాయతీరాజ్ కార్యదర్శి తదితర పలువురితో చర్చించి చివరకు కొత్త పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేసేలా ఆర్డినెన్సును జారీచేశారు. రిజర్వేషన్లపై గందరగోళం తొలగిపోయిందిగానీ మొత్తం యాభై శాతం రిజర్వేషన్లలో బి.సి.లకు ఎంత శాతం అనే కొత్త సమస్య వచ్చిపడింది.

New panchayat raj has brought ordinance to amend law

Telangana Latest News