Home తాజా వార్తలు ‘బాబు చంపేస్తాడు’ అనే పాట వీర బ్రహ్మ ముహూర్తంలో విడుదల

‘బాబు చంపేస్తాడు’ అనే పాట వీర బ్రహ్మ ముహూర్తంలో విడుదల

RGV

 

హైదరాబాద్: ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే పాటను విడుదల చేసిన ఆర్‌జివి మంగళవారం సాయంత్రం రెండో పాటను విడుదల చేయనున్నారు. ‘బాబా చంపేస్తాడు’ అనే పాట వీర బ్రహ్మ మూహుర్తంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని చెప్పారు. వీర బ్రహ్మ ముహూర్తం అనగా సాయంత్రం 4.37 గంటలకు బదులు 4:59 విడుదల చేయబోతున్నానని ఆర్‌జివి ప్రకటించారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే పాటను యూ ట్యూబ్ లో ఇప్పటివరకు 12 లక్షల మంది వీక్షించారు. ఈ పాటను 37 వేల మంది లైక్ చేయగా 8.5 వేల మంది డిస్ లైక్ చేశారు. ఈ సినిమాకు రవి శంకర్ సంగీతమందించగా సిరాశ్రీ పాటలు పాడారు. 

 

New Song Release in Kamma Rajyam Lo Kadapa Reddlu

 

Babu Champestadu Song Released by RGV